చిరుకి క‌లిసొచ్చిన రీమేక్‌!



ఆచార్య‌తో చిరంజీవి ఫ్యాన్స్ దారుణంగా డీలా ప‌డిపోయారు. అన్ని వైపుల నుంచీ విమ‌ర్శ‌లే. ఆ సినిమా ఓపెనింగ్స్ కూడా నిరాశ‌కు గురి చేశాయి. చిరంజీవి ఇక రిటైర్ అయిపోవొచ్చేమో..? అనేంత‌గా భ‌య‌పెట్టాయి. అయితే… చిరు `గాడ్‌ఫాద‌ర్‌`తో బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకొన్నారు. ఈ సినిమాలో చిరు పెర్‌ఫార్మ్సెన్స్‌, స్క్రీన్ ప్రెజెన్స్‌, ఈ సినిమాకి వ‌స్తున్న స్పంద‌న‌, వ‌సూళ్లు.. ఇలా… అన్ని విధాలుగానూ అభిమానుల‌కు ఊపిరి పోశాయి. నిజానికి లూసీఫ‌ర్ రీమేక్ అన‌గానే ఫ్యాన్స్ కూడా నిరుత్సాహ ప‌డిపోయారు. […]