Telugu 360 Telugu

Card image cap

టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేస్తారా !?

రైతుల కోసం అవసరం అయితే రాజీనామా చేస్తామంటూ టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ , ఎంపీ కే.కేశవరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆయన ఆ మాటలు ఊరకనే అని ఉండరని..ఎదో వ్యూహంతోనే అని ఉంటారన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. కేంద్రంతో తాడో పేడో తేల్చుకునే దిశలో రైతుల కోసం అవసరం అయితే పదవులు కూడా వదులుకుంటామని సంకేతం పంపేందుకు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో టీఆర్ఎస్‌కు ఏడుగురు […]

Card image cap

ఓటీఎస్ : సేల్ డీడ్ కాదు డాక్యుమెంటే !?

వన్ టై సెటిల్మెంట్ పేరుతో పేదలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డగోలుగా మోసం చేస్తోందన్న అనుమానాలు బలపరిచే మరో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శులే రిజిస్ట్రేషన్ చేసేస్తారని.. వారికి సేల్ డీడ్ ఇస్తామని.. వాటిని ఏ బ్యాంకులో అయినా తాకట్టు పెట్టుకోవచ్చని.. ఎవరికైనా అమ్ముకోవచ్చని ఏపీ సర్కార్ చెబుతోంది. అందుకే.. రూ. పది.. ఇరవేలు వసూలు చేస్తున్నామని చెబుతోంది. కానీ ఆ డాక్యుమెంట్లు చెల్లవన్న అభిప్రాయం .. న్యాయవర్గాల్లో వినిపిస్తోంది. ఇండియన్ జ్యూడిషియల్ […]

Card image cap

టీడీపీలో కోవర్టులు బహిరంగం ! చంద్రబాబు చర్యలెప్పుడు తీసుకుంటారు ?

పార్టీలో కోవర్టులున్నారని వారిని ఏరివేసి ప్రక్షాళన ప్రారంభిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు. కుప్పం నుంచే ఆ పని చేస్తానన్నారు. కుప్పంపై రివ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిజానికి తెలుగుదేశం పార్టీలో నిజాయితీగా పని చేసేవారు ఎవరో.. ఇతర పార్టీలు కుమ్మక్కయిన వారు ఎవరో ఆ పార్టీలో కింది స్థాయిలో పని చేసే వారికీ స్పష్టత ఉంది. రాష్ట్ర స్థాయిలో పలువురు నేతలు గోడ మీద పిల్లుల్లాగా ఉంటూ.. అటు అధికార పార్టీకి కోవర్టులుగా పని […]

Card image cap

సింగరేణిపైనా కేంద్రంతో కేసీఆర్ ఢీ !

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు సింగరేణి విషయంలోనూ తాడో పేడో తేల్చుకోవాలనుకుంటున్నారు. అన్ని అమ్మేస్తున్నట్లుగానే సింగరేణిని కూడా కొద్ది కొద్దిగా కేంద్రం అమ్ముతోంది. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ సింగరేణిలోని నాలుగు బొగ్గు గనుల వేలం వేయాలని నిర్ణయించింది . దీనికి సంబంధించి సాంకేతిక ప్రక్రియను పూర్తి చేసింది. ఇది సింగరేణి కార్మికులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. వారంతా సమ్మె బాట పట్టారు. గురు, శుక్ర, శనివారాల్లో సమ్మె చేస్తున్నారు. అయితే […]

Card image cap

బిపిన్ రావత్ హెలికాఫ్టర్ ఎలా కూలింది? అసలు కారణాలేంటి ?

భారత త్రివిధ దళాల అధిపతి అంటే ప్రధానమంత్రి కంటే ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే మొత్తం రక్షణ వ్యవస్థ ఆయన చేతుల్లో ఉంటుంది. అందుకే ఆయన ప్రతి అడుగులోనూ వ్యవస్థ మొత్తం అప్రమత్తంగా ఉంటుంది. అలాంటి ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ఒక్క సారిగా కుప్పకూలింది. గాల్లో మంటలు అంటున్నట్లుగా కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రాష్ ల్యాండింగ్ అయినట్లుగా మరికొన్ని వీడియోలు కనిపిస్తున్నాయి. ఏం జరిగిందన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. బిపిన్ రావత్ ప్రయాణించిన […]

Card image cap

హోదా, జోన్, పోలవరం…ఏదీ లేదు! వైసీపీ నోరెత్తదేం ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిస్సహాయత, వైసీపీ చేతకానితనం కారణంగా ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతోంది. పార్లమెంట్‌ సమావేశాల్లో దొరికింది ఇదే సందు అని రాష్ట్రానికి రావాల్సిన అన్ని ప్రయోజనాలపై కేంద్రం వేటు వేసింది. ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని ఇచ్చే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది.పోలవరం ప్రాజెక్ట్ వచ్చే ఏప్రిల్‌కు పూర్తికాదని.. సవరించిన అంచనాలను ఇచ్చే ప్రశ్నే లేదని చెప్పింది. చివరికి అధికారిక ప్రకటన చేసిన రైల్వే జోన్ విషయాన్ని కూడా లైట్ తీసుకున్నట్లుగా తెలిపింది. ఇంకా విభజన సమస్యల […]

Card image cap

హెలికాఫ్టర్ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కన్నుమూత !

భారత సైనిక దళాల చీఫ్ బిపిన్ రావత్ హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఉదయం తమిళనాడులోని వెల్లింగ్టన్‌లో ఉన్న ఆర్మీ స్టాఫ్ కాలేజీలో శిక్షణ పొందిన వారిని ఉద్దేశించి ప్రసంగించేందుకు కోయంబత్తూరు నుంచి సైనిక హెలికాఫ్టర్‌లో బయలుదేరారు. ఆయనతో పాటు భార్య మధులికతో పాటు మరికొంత మంది ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారు. అయితే అనూహ్యంగా మరో పది నిమిషాల్లో స్టాఫ్ కాలేజీకి చేరుకుంటారనగా.. కన్నూరు వద్ద హెలికాఫ్టర్ కూలిపోయింది. ప్రతికూల వాతావరణం లేకపోయినా.. ప్రపంచంలోనే ది బెస్ట్ అనే […]

Card image cap

పార్లమెంట్‌లో వైసీపీ లాంగ్వేజ్ వినిపిస్తున్న ఎంపీ గోరంట్ల మాధవ్ !

వైసీపీ అధికార భాషగా మారిపోయిన బూతులు, బెదిరింపులను ఎంపీ గోరంట్ల మాధవ్ పార్లమెంట్‌కు తీసుకెళ్లారు. గతంలో టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు తెలుగులోఆయన బూతులు అందుకునేవారు. ఇప్పుడు సొంత పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆ బాధ్యత తీసుకున్నారు. గతంలో పార్లమెంట్ ప్రాంగణంలో రఘురామకృష్ణరాజు అంతు చూస్తానని బెదిరించడమే కాదు.. ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టడం.. కేకలేయడంతో ఇతర రాష్ట్రాల ఎంపీలూ ఆశ్చర్యపోయారు. అప్పుడే రఘురామరాజు తర్వాత స్పీకర్‌కు ప్రధానికి ఫిర్యాదు చేశారు. రెండు రోజుల […]

Card image cap

విశాఖకు రైల్వే జోన్ ఇవ్వరట !

గత ఎన్నికలకు ముందు హడావుడిగా విశాఖలైర్వే జోన్‌ను ప్రకటించిన కేంద్రం తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఇప్పుడు అసలు జోన్‌ చేసే ఉద్దేశం లేదని పార్లమెంట్‌లో ప్రకటించేసింది. అసలుదేశంలో ఇక కొత్త రైల్వే జోన్‌లను ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. ప్రస్తుతం 17 రైల్వేజోన్లు ఉన్నాయని కేంద్రమంత్రి వెల్లడించారు. విశాఖ రైల్వేజోన్ అంశాన్ని అశ్వనీ వైష్ణవ్ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ మేరకు.. మరిన్ని జోన్‌లను ప్రకటించే ఉద్దేశం లేదని ఆయన […]

Card image cap

భారత త్రివిధ దళాల చీఫ్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌కు ప్రమాదం !

భారత త్రివిధ దళాల చీఫ్‌గా ఉన్న బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ తమిళనాడులోని కూనూరు దగ్గర కూలిపోయింది. పర్వాత ప్రాంతాలైన నీలగిరీస్ జిల్లాలో ఇది ఉంది. ఓ ఆర్మీ సంబంధిత కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్కడకు వెళ్లారు. కుటుంబసభ్యులతో కలిసి ఎంఐ 17 హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తున్న సమయంలో హఠాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయనకు ఏమైనా గాయాలయ్యాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై ప్రభుత్వం పూర్తి స్థాయి గోప్యత పాటిస్తోంది. కేంద్ర ప్రభుత్వమే అధికారిక […]

Card image cap

‘శంకరాచార్య‌’గా బాల‌కృష్ణ‌

ప్ర‌యోగాలు చేయ‌డంలో ఎప్పుడూ ముందుండే వ్య‌క్తి నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఆయ‌న అన్ని ర‌కాల జోన‌ర్ల‌నీ ట‌చ్ చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న దృష్టి శంక‌రాచార్య పాత్ర‌పై ప‌డింది. హైంధ‌వ ధ‌ర్మాన్ని ప్ర‌చారం చేసిన మ‌హోన్న‌త వ్య‌క్తి. అత‌ని జీవితాన్ని తెర‌పై చూపించాల‌న్న‌ది బాల‌కృష్ణ ప్ర‌య‌త్నం. దానికి సంబంధించిన స్క్రిప్టు కూడా త‌యార‌వుతోంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి సి.క‌ల్యాణ్ కూడా స‌ముఖంగా ఉన్నారు. బాల‌య్య‌తో క‌ల్యాణ్‌కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో రెండు సినిమాలొచ్చాయి. మూడో సినిమా […]

Card image cap

మళ్లీ పాట పాడేసిన ర‌వితేజ‌

మ‌న హీరోల‌కు పాట‌లు పాడ‌డం భ‌లే స‌ర‌దా. స్టార్ హీరోలంతా ఎప్పుడో ఒక‌ప్పుడు గొంతు స‌వ‌రించుకున్న‌వాళ్లే. ర‌వితేజ కూడా ఇది వ‌ర‌కు గాయ‌కుడిగా త‌న అవ‌తారం చూపించేశాడు. డిస్కోరాజా, ప‌వ‌ర్, బ‌లుపు చిత్రాల్లో పాట‌లు పాడాడు. ఇప్పుడు మ‌రోసారి.. గొంతు స‌వ‌రించుకున్నాడు. `ఖిలాడీ` కోసం. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్ర‌మిది. వ‌చ్చే ఏడాది విడుద‌ల అవుతోంది. ఈ చిత్రం కోసం ర‌వితేజ ఓ పాట పాడాడు. దేవిశ్రీ ప్ర‌సాద్ ఇచ్చిన స‌ర‌దా ట్యూను ర‌వితేజ గొంతులోనే […]

Card image cap

బాల‌య్య విగ్గు @ 50 ల‌క్ష‌లు

నంద‌మూరి బాల‌కృష్ణ అంద‌గాడు. ఈ విష‌యంలో డౌటే లేదు. కాక‌పోతే.. బాల‌య్య‌ని చూపించ‌డం తెలిసి ఉండాలి. ఈ విష‌యంలో బోయ‌పాటి శ్రీ‌ను డిగ్రీలూ, పీహెచ్‌డీలూ చేసేశాడు. సింహా, లెజెండ్ చిత్రాల్లో బాల‌య్య అందంగా క‌నిపించాడు. అఖండ‌లోనూ అంతే. ముర‌ళీకృష్ణ పాత్ర‌లో ఛార్మ్ ఉంది. త‌న కాస్ట్యూమ్స్ బాగున్నాయి. విగ్గ‌యితే.. ప‌ర్‌ఫెక్ట్ గా సూట‌య్యింది. సాధారంగా బాల‌య్య‌కు విగ్గుల ద‌గ్గ‌రే స‌మ‌స్య‌. ఒక్కో సినిమాలో ఒక్కేలా విగ్ ఉంటుంది. కొన్నిసార్లు… విగ్గులు కుద‌ర‌క‌పోవ‌డం వ‌ల్ల‌, ఎఫెక్ట్ బాల‌య్య‌పై, ఆ […]

Card image cap

చిరు స్పీడుకి కార‌ణం ఇదేనా?

ఓ అగ్ర హీరో చేతిలో 4 చిత్రాలు ఉండ‌డం, నాలుగూ ఒకేసారి షూటింగ్ జ‌రుపుకోవ‌డం రికార్డే. ఆ రికార్డు.. ఇప్పుడు చిరంజీవి పేరుమీదుంది. ఆచార్య‌, గాడ్ ఫాద‌ర్‌, భోళా శంక‌ర్‌, బాబీ సినిమా.. ఇవి నాలుగూ హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి. ఆ నాలుగు సినిమాల‌కూ చిరు ఈ నెల‌లో డేట్లు కేటాయించారు. అలా.. చిరు కెరీర్‌లో ఎప్పుడూ చూడ‌ని దృశ్యానికి ఈ డిసెంబ‌రు వేదిక అయ్యింది. నిజానికి చిరుకి ఇంత హ‌ర్రీ బ‌ర్రీగా సినిమాలు చేయాల‌ని […]

Card image cap

కాంగ్రెస్ కూటమిలోకి శివసేన.. పీకేకు చెక్ !

కాంగ్రెస్‌లో చేరి చక్రం తిప్పాలనుకున్న ప్రశాంత్ కిషోర్‌కు అక్కడ అడ్డుపుల్లపడింది. దాంతో కాంగ్రెస్‌ను లేకుండా చేసి మమతా బెనర్జీని ఆ ప్లేస్‌లోకి తేవాలని తన ఫిరాయింపుల వ్యూహ రాజకీయాలను ప్రయోగిస్తున్నారు. అయితే అది ఆయన అనుకున్నంత సులువుగా లేదు. మమతా బెనర్జీతో యూపీఏ ఎక్కడుంది అనిపించినా… కాంగ్రెస్ పార్టీ కూటమిలోనే ఉండేందుకు ప్రధానమైన ప్రాంతీయ పార్టీలు సుముఖత చూపుతున్నాయి. శివసేన కూడా యూపీలోనే భాగస్వామి అవ్వాలని నిర్ణయించుకుంది . ఇప్పటి వరకూ మహారాష్ట్రలో మాత్రమే కాంగ్రెస్‌తో కలిసి […]

Card image cap

ప్రాథమిక ఆధారాల్లేకుండా సెలబ్రిటీలను ఈడీ ప్రశ్నించిందా !?

సినీ తారలపై డ్రగ్స్ కేసుల్లో ఈడీ కేసులు తేలిపోయాయి. ప్రాథమిక ఆధారాలు కూడా లేవన్న కారణంతో ఆ కేసుల్ని ముగించేయాలని ఈడీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండానే ఈడీ ఎందుకు కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించిందనేది ఇప్పుడు ఆసక్తికరకంగా మారింది. ఎప్పుడో 2017లో తెలంగాణ పోలీసులు నమోదు చేసి.. సినీ తారలను ప్రశ్నించిన కేసును తీసుకున్న ఈడీ తాము కూడా నాలుగేళ్ల తర్వాత రంగంలోకి దిగింది. హఠాత్తుగా అందర్నీ ప్రశ్నించింది. […]

Card image cap

హమ్మయ్య.. అమిత్ షా వినతి పత్రం తీసుకున్నారు !

రఘురామకృష్ణరాజు అవసరం అనుకున్నప్పుడల్లా హోంమంత్రి అమిత్ షాను కలిసి చెప్పాలనుకున్నది చెప్పి వినతి పత్రం ఇచ్చి వస్తున్నారు. ఆయన ఫిర్యాదు చేసిన వారందరికీ రివర్స్‌లో ఫిర్యాదు చేయాలనుకునే స్ట్రాటజీ.. పెట్టుకున్న వైసీపీ నేతలకు మాత్రం ఆ అవకాశం దక్కడం లేదు. ఎంత ప్రయత్నించినా షా దగ్గరకు రానివ్వడం లేదు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అమిత్ షా .. పార్లమెంట్‌లోని తన చాంబర్‌లో కాస్తంత తీరికగా ఉంటున్నారు. అడిగిన వారికి రెండు నిమిషాల సమయం కేటాయిస్తున్నారు. గత వారం […]

Card image cap

ఎక్కడ చూసినా హరీష్ రావే కనిపిస్తున్నారేంటి !?

తెలంగాణ ప్రభుత్వంలో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. హరీష్ రావుకు పెరిగిన ప్రాధాన్యం ఎవరూ ఊహించని విధంగా ఉంది. గతంలో ఎక్కడ ఆకస్మిక తనిఖీలు చేసినా.. అభివృద్ధి కార్యాక్రమాలు ప్రారంభించినా… ఏదైనా సరే మంత్రి కేటీఆర్ కనిపించేవారు. కానీ ఇప్పుడు హరీష్ రావు కనిపిస్తున్నారు. ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రిగా హరీష్ రోజూ మీడియాలో హైలెట్ అవుతున్నారు. కానీ కేటీఆర్ మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ఆయన పాల్గొనే కార్యక్రమాలు కూడా తగ్గిపోయాయి. వైద్య ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు […]

Card image cap

రైతులకు సీమ ప్రజల మద్దతును “వైసీపీ మేధావులు” డిసైడ్ చేస్తారా !?

అమరావతి రైతుల పాదయాత్ర చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. నెల్లూరు వరకూ కోస్తా ప్రాంతం కిందకు వచ్చినా చిత్తూరు మాత్రం రాయలసీమ కిందకు వస్తుంది. అక్కడా రైతులకు అనూహ్యైన స్వాగతం లభిస్తోంది. అధికార బలాన్ని ఉపయోగించుకుని వైసీపీ ఎమ్మెల్యేలు.. ఇతర నేతలు రైతులకు సాయం చేసిన వారిపై కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ సహకరించడానికి చాలా మంది ముందుకువస్తున్నారు. దీంతో సహజంగానే రాజధాని రైతులకు సీమ ప్రజల మద్దతు ఉందన్న అభిప్రాయం బలంగా వినిపించడం ప్రారంభమయింది. అయితే […]

Card image cap

ఇప్పటికి ఏపీ బ్యాంకుల అప్పు రూ.57,479 కోట్లు !

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పు రూ.57,479 కోట్లుగా కేంద్రం లెక్క తేల్చింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి భగవత్‌ కరాడ్‌ సమాధానం ఇచ్చారు. ఏ ఏ బ్యాంకుల నుంచి ఎంత తీసుకున్నది కూడా వివరించారు. పది జాతీయ బ్యాంకులకూ ఏపీ ప్రభుత్వం చాన్సిచ్చింది. స్టేట్ బ్యాంక్‌కు పదకొండు వేల కోట్ల వరకూ అవకాశం ఇవ్వగా చివరికి ఏపీలో ఎక్కడా పెద్దగా […]

Card image cap

ఉద్యోగ సంఘాల్లో వైసీపీ మార్క్ విభజన !

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు నిరసనలు ప్రారంభించాయి. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామన్న జగన్ మాటను ఉద్యోగులు నమ్మడం లేదు. ఒక్క పీఆర్సీ కాదు ఇంకో 70 సమస్యలు ఉన్నాయని బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు అనే ఇద్దరు నేతలు చెలరేగిపోతున్నారు. వీరిద్దరినీ నిన్నామొన్నటి వరకూ కంట్రోల్‌లో పెట్టిన సజ్జల ఇప్పుడు ఎందుకో కానీ పెద్దగా దృష్టి పెట్టడం లేదు. దీంతో వారు స్వేచ్చగా ఉద్యమం చేసుకుంటున్నారు. నిరసనలు ప్రారంభించారు. ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే వైసీపీ వ్యూహం […]

Card image cap

కేసీఆర్‌కు రావాల్సిన ఈడీ నోటీసులు ఆగిపోయాయంటున్న రేవంత్ !

పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు ఆందోళన చేశారు..? . ధాన్యం కొనుగోళ్ల విషయంలో క్లారిటీ ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. మరి ఎందుకు విరమించారు..? ఎందుకు అసలు సభకే డుమ్మా కొట్టాలనుకున్నారు..? ఇది మాత్రం ఎవరికీ తెలియదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనలు.. విరమణ వెనుక ఉన్నది ఈడీ నోటీసుల వ్యవహారమని అంటున్నారు. కేసీఆర్‌ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లుగా కేంద్రం వద్ద ఆధారాలున్నాయని.. ఈడీ నోటీసులు పంపిస్తారని తెలిసిన తర్వాతే ఆయన […]

Card image cap

ఆ విష‌యంలో ఏఎన్నార్ నాకు ఆద‌ర్శం – శ్రియ‌తో ఇంట‌ర్వ్యూ

ముద్దుగా క‌నిపించి, వెండి తెర‌పై అల్ల‌రి చేసే పాత్ర‌ల్లో న‌టించి మెప్పించింది శ్రియ‌. స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించింది. త‌న ఖాతాలో బోలెడ‌న్ని క‌మ‌ర్షియ‌ల్ హిట్స్ ఉన్నాయి. క‌థానాయిక‌గా సుదీర్ఘ‌మైన ప్ర‌యాణం చేసి, కెరీర్ లో పూర్తిగా స్థిర‌ప‌డిన త‌ర‌వాత పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఓ బిడ్డ‌కు త‌ల్లి కూడా. బాధ్య‌త‌లు పెర‌గ‌డంతో… సినిమాలు త‌గ్గించుకుంటోంది. కాక‌పోతే.. మంచి క‌థ‌లొస్తే మాత్రం త‌ప్ప‌కుండా న‌టిస్తా… అని సంకేతాలు పంపేసింది. త‌ను న‌టించిన `గ‌మ‌నం` ఈనెల 10న విడుద‌ల […]

Card image cap

శ్యామ్ సింగ‌రాయ్ పై ‘సిరివెన్నెల’ చివ‌రి సంత‌కం

దాదాపు 3 వేల పాట‌లు రాశారు సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి. త‌న తొలి సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఆయ‌న చివ‌రి పాట‌లోనూ `సిరివెన్నెల‌` ప్ర‌స్తావ‌న రావ‌డం.. యాధృచ్చికం అంటే మ‌న‌సు ఒప్పుకోదు. అది విధి లీల‌. శ్యామ్ సింగ‌రాయ్‌లో సిరివెన్నెల.. `సిరివెన్నెల‌` అనే పాట రాశారు. అది ఆయ‌న ఆఖ‌రి పాట‌. సిరివెన్నెల మ‌ర‌ణించిన రెండో రోజున‌.. ఈ పాట‌ని రికార్డ్ చేసింది చిత్ర‌బృందం. ఈ సినిమాని ఆయ‌న‌కే అంకితం కూడా ఇచ్చింది. సిరివెన్నెల రాసిన‌. ఆ సిరివెన్నెల […]

Card image cap

సోము వీర్రాజుకు విరక్తి పుట్టిందా ? సెంటిమెంట్ పండిస్తున్నారా ?

2024 తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటానని సోము వీర్రాజు ప్రకటించడం ఆ పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. తాను 42 ఏళ్లుగా రాజకీయం చేస్తున్నానని వచ్చే ఎన్నికల తర్వాత రాజకీయాల్లో ఉండబోనని ఆయన తేల్చి చెప్పారు. ఇంత హఠాత్తుగా ఎందుకు నిర్ణయం తీసుకున్నారో కానీ.. ఆయన బీజేపీని గెలిపించే రాజకీయాల నుంచి వైదొలుగుతా అన్నట్లుగా మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం ఇవ్వాలని ఏపీ ప్రజలను కోరారు. భారతీయ జనతా పార్టీకి పాలించే సత్తా ఉందన్నారు. సోము వీర్రాజు ప్రకటనను […]

Card image cap

అయినా .. కర్నూలుకే కార్యాలయాల తరలింపు !

మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.కానీ కార్యాలయాల తరలింపును మాత్రం ఆపడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని గెజిట్ జారీ చేసింది. వక్ఫ్‌ భూముల పరిరక్షణకు సంబంధించి న్యాయపరమైన అంశాలను వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ విచారణ జరుపుతుంది. ఇప్పటి వరకూ ఈ ట్రిబ్యునల్ హైదరాబాద్‌లో ఉంది. కార్యాలయాల తరలింపు విషయంలో హైకోర్టు స్టే ఉంది. ఇటీవల మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకున్న తర్వాత కూడా […]

Card image cap

ఔను.. పార్లమెంట్ సమావేశాలకు టీఆర్ఎస్ డుమ్మా !

పార్లమెంట్ సమావేశాలకు టీఆర్ఎస్ డుమ్మా కొట్టబోతోందని తెలుగు 360 రెండు రోజుల కిందటే చెప్పింది. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని టీఆర్ఎస్ ఎంపీలు అధికారికంగా తీసుకున్నారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బాథ్యలను సీఎం కేసీఆర్ ఎంపీలకు ఇచ్చారు. క్యాంపుల్లో ఉన్న టీఆర్ఎస్ ఓటర్లు ఎవరూ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడకుండా అందరూ సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న టీఆర్ఎస్ మంగళవారం మధ్యాహ్నం నుంచి పార్లమెంట్‌ను బహిష్కరించాలని నిర్ణయించింది. మంగళవారం ఉదయం […]

Card image cap

పెళ్లి లైవ్‌లో చూపిస్తే.. వంద కోట్లు

బాలీవుడ్ లో మేట‌రే వేరు. అక్క‌డ దేన్న‌యినా స‌రే ప్ర‌చారంగా, వ్యాపారంగా మార్చేసుకుంటుంటారు. ఆఖ‌రికి పెళ్లి కూడా. సెల‌బ్రెటీలు ప్రేమించి పెళ్లి చేసుకుంటేవిప‌రీత‌మైన మైలేజీ. ఇప్పుడు క‌త్రినా – విక్కీల పెళ్లికీ అంత‌టి మైలేజీ ఉంది. ఈనెల 9న వీరిద్ద‌రి పెళ్లి రాజ‌స్థాన్‌లో జ‌ర‌గ‌బోతోంది. పెళ్లికి నెల రోజుల ముందు నుంచీ… వీళ్ల‌దే హ‌డావుడి అంతా. బాలీవుడ్ అంతా.. ఈ పెళ్లిపై ప్ర‌త్యేక‌మైన దృష్టి పెట్టింది. రాజ‌స్థాన్ లోని సిక్స్‌సెన్సెస్ ఫోర్టులో కత్రినా- విక్కీల పెళ్లి జ‌ర‌గ‌బోతోంది. […]

Card image cap

‘ఛ‌త్ర‌ప‌తి’కి టైటిల్ కావ‌లెను

తెలుగులో సూప‌ర్ హిట్ట‌యిన `ఛ‌త్ర‌ప‌తి`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్ట‌బోతున్నాడు. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌కూ ఇదే తొలి హిందీ సినిమా. ప్ర‌స్తుతం గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్‌లో షూటింగ్ జ‌రుగుతోంది. ఛ‌త్ర‌ప‌తి క‌థ‌లో కొన్ని కీల‌క‌మైన మార్పులు చేసి, ఈ త‌రానికి న‌చ్చేలా రూపొందిస్తున్నాడు వినాయ‌క్. హిందీ సినిమా కాబ‌ట్టి… వాళ్ల‌కి న‌చ్చే అంశాల‌న్నీ ఇందులో పొందు ప‌ర‌చి.. టోట‌ల్ గా ఓ గ్రాండ్ […]

Card image cap

ప్రభుత్వ వేధింపులపై “గొట్టిపాటి” న్యాయపోరాటం .. సుప్రీంలో ఊరట !

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కుటుంబానికి చెందిన కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వారీల్లో తనిఖూలు చేసి కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ అవకతవకలకు పాల్పడిందని అదికారులు నివేదిక రూపొందించింది. దాని ఆధారంగా ‘కిషోర్‌ గ్రానైట్స్‌’కు జరిమానా విధిస్తూ గనుల శాఖ నోటీసులిచ్చింది. వీటిపై కంపెనీ హైకోర్టును ఆశ్రయించగా… సింగిల్‌ బెంచ్‌ వాటిని కొట్టివేసింది. అయితే ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌ కు వెళ్లింది. డివిజన్ […]

Card image cap

తెలంగాణలో “బియ్యం స్కాం” బద్దలవబోతోందా !?

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆ ఆంశంపైనే దృష్టి కేంద్రీకరించి బీజేపీని నిలుపుదల చేయాలని చూస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్ ఊహించని విధంగా ఎదురుదాడి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్‌లో బియ్యం కొనుగోలు అంశంలో పీయూష్ గోయల్ ఇచ్చిన సమాధానంలో తెలంగాణలో బియ్యం సేకరణలో భారీ అవకవకలు గుర్తించామని ప్రకటించారు. సరిగ్గా ఇదే అంశంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చాలా రోజులుగా విమర్శలు చేస్తున్నారు. […]

Card image cap

కరోనా బాధిత జర్నలిస్టు కుటుంబాలకు తెలంగాణ సర్కార్ అండ !

జర్నలిస్టుల సంక్షేమంలో మాటలు చెప్పడం కన్నా అంతో ఇంతో ఆచరణలో చూపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గతంలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు రూ. ఇరవై వేల చొప్పున ఇచ్చిన ప్రభుత్వం.. ఆ మహమ్మారి బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలకూ అండగా ఉంటోంది. కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. రెండు లక్షలు.. ఇతర కారణాలతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. పదిహేనో తేదీన ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు […]

Card image cap

“అన్నమయ్య”పై కదిలిన కేంద్రం.. రాష్ట్రం కవరింగ్ !

అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిన విషాదం వెనుక తప్పిదం ఎవరిదో తేల్చి శిక్షించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పిన కేంద్ర మంత్రి షెకావత్‌పై వైసీపీ నేతలు దారుణమైన విమర్శలు చేయడంతో బీజేపీ హైకమాండ్‌కు అనేక ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో వెంటనే అన్నమయ్య ప్రాజెక్ట్ విషాదానికి కారణం ఏమిటో తేల్చేందుకు ప్రత్యేకంగా కమిటీని నియమించాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రికార్డులు పరిశీలించి.. క్షేత్ర స్థాయిలో పర్యటించి ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. […]

Card image cap

ఏపీలో ” ఫైవ్ పర్సంట్ ” రూల్..! ఇక అందరికీ వర్తింపు ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసింది. జీవోలన్నీ రహస్యంగా ఉంచుతోంది కాబట్టి ఇలాంటి చిత్రవిచిత్రాలు ఎన్ని ఉంటున్నాయో కానీ కొన్ని బయటకురాక తప్పదు. అలా వచ్చిన కొత్త జీవో ప్రకారం.. ఇక నుంచి ఏపీలో ఎవరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నా ఐదు శాతం జగనన్న కాలనీలకు చందా ఇచ్చుకోవాల్సిందే. అది స్థలం రూపంలో అయినా కావొచ్చు.. డబ్బు రూపంలో అయినా కావొచ్చు. అది ఇచ్చే వాళ్ల ఇష్టం. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేసే ప్రైవేటు […]

Card image cap

పుష్ప ట్రైల‌ర్‌: పుష్ప అంటే ఫ్ల‌వ‌రు కాదు.. ఫైరు

ఈరోజు 6 గంట‌ల‌కు రిలీజ్ అవ్వాల్సింది.. పుష్ప ట్రైల‌ర్‌.కానీ మూడున్న‌ర గంట‌లు ఆస్య‌మైంది. అయితేనేం.. ఆ ఫైరు.. త‌గ్గ‌లే. ఎదురుచూసీ ఎదురు చూసీ విసిగిపోయిన అభిమానుల‌కు పుష్స నుంచి… అదిరిపోయే గిఫ్టు వ‌చ్చేసింది ట్రైల‌ర్ రూపంలో. 2 నిమిషాల 30 సెక‌న్ల టీజ‌ర్ ఇది. 150 సెక‌న్ల‌లోనే సుకుమార్ సినిమా చూపించేశాడు. భూమండ‌లంలో యాడా పెర‌గ‌ని చెట్టు మ‌న శేషాచ‌లం అడ‌వుల్లో పెరుగుతాంది. భూమిపై పెరిగే బంగారం.. పేరు ఎర్ర‌చంద‌నం – అనే అజ‌య్ ఘోష్ డైలాగ్ […]

Card image cap

పుష్ప ట్రైలర్ కు అంతరాయం.. సారీ చెప్పిన నిర్మాతలు

అల్లు అర్జున్.. సుకుమార్‌ ల పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. రష్మిక కథానాయిక. ఫహాద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ ఇలా భారీ తారాగణం వుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తొలి భాగం ‘పుష్ప- ది రైజ్‌’ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (డిసెంబర్ 6) సాయంత్రం ఆరు గంటలకు సినిమా ట్రైలర్ రిలీజ్ కి ముహుర్తహం పెట్టారు. అయితే ఇప్పుడా ట్రైలర్ రాకకు అంతరాయం ఏర్పడింది. కొన్ని […]

Card image cap

జగన్‌దే కాదు సీబీఐదీ అదే వాదన ! మరి తీర్పు ?

అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ పెట్టుకున్న పిటిషన్‌ను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి అవకాశం ఇవ్వవొద్దని హైకోర్టులో వాదనలు వినిపించింది. సాక్షులను ప్రభావితం చేస్తారన్న కారణంగానే గతంలో హైకోర్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వలేదని .. ఇప్పుడు జగన్ హోదా పెరిగినందున మరితంగా సాక్షాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ స్పష్టం చేసింది. పదేళ్లుగా అక్రమాస్తుల కేసుల విచారణ ముందుకు సాగకుండా రకరకాల పిటిషన్లు వేస్తున్నారని.. […]

Card image cap

అఖండ.. ‘అన్‌స్టాపబుల్‌’

‘అన్‌స్టాపబుల్‌’ షోలో బాలకృష్ణ ఎనర్జీ మాములుగా లేదు. చేతికి కట్టు కట్టుమరీ వంటి చేత్తో షోని నడుపుతున్నారు బాలయ్య. ఆయన హోస్టింగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈ షో నుంచి కొత్త ప్రోమో వచ్చింది. అఖండ టీం షోకి వచ్చింది. ఈ సందర్భంగా బాలయ్య సందడి మాములుగా లేదు. దర్శకుడు బోయపాటి, శ్రీకాంత్‌, ప్రజ్ఞ జైస్వాల్‌తో కలిసి బాలకృష్ణ తెగ హంగామా చేశారు. ‘నేనూ విలన్‌గా నటించేందుకు సిద్ధంగా ఉన్నా.. కానీ అందులో హీరో […]

Card image cap

లోక్‌సభలో “వైసీపీ ఆర్” వర్సెస్ వైసీపీ

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఎదుర్కోవడం మిగతా వైసీపీ ఎంపీలకు కష్టమై పోతోంది. ఆయన ప్రెస్మీట్లు పెట్టకుండా చేయాల్సినదంతా చేసినా .. చివరికి దేశద్రోహం కేసు పెట్టినా ఆపలేకపోయారు. ఇప్పుడు పార్లమెంట్‌లోనూ ఆయన మాట్లాడుతూండటంతో అడ్డుకోలేకపోతున్నారు. సోమవారం లోక్‌సభ జీవో అవర్‌లో రఘురామకృష్ణరాజు మాట్లాడారు. రైతుల పాదయాత్రపై పోలీసుల దాడుల అంశాన్నిప్రధానంగా ప్రస్తావించారు. హైకోర్టు నుంచి అనుమతులు ఉన్నా పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరమని … రాజధాని కోసం 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన వారిని తీవ్రంగా […]

Card image cap

ఈటల కబ్జాలు నిజమేనని తేల్చిన మెదక్ కలెక్టర్ !

ఈటల రాజేందర్ భూములు కబ్జా చేసినట్లుగా మెదక్ జిల్లా కలెక్టర్ తేల్చారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించడమే కాదు ప్రెస్ మీట్ పెట్టి కూడా మీడియాకు చెప్పారు. ఈటల రాజేందర్ భార్య జమున పేరు మీద ఉన్న జమున హ్యాచరీస్ ఏర్పాటు చేసిన భూముల్లో సీలింగ్ ల్యాండ్స్ ఉన్నట్లుగా మెదక్ కలెక్టర్ హరీశ్ ఆధ్వర్యంలోని కమిటీ తేల్చింది. పౌల్ట్రీ ఫాంకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి లేదని నిర్ధారించారు. మొత్తంగా మందికి చెందిన 76 ఎకరాల […]

Card image cap

పుష్ప ఐటెం సాంగ్ కి ఐదుగురు డ్యాన్స్ మాస్టర్లు

అల్లు అర్జున్- సుకుమార్- దేవిశ్రీ ప్రసాద్.. ఈ ముగ్గురిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన ఆర్య, ఆర్య2 .. ఆడియో పరంగా చార్ట్ బస్టర్స్. ఇప్పటికీ ఆ సినిమాల్లో పాటలు ఎవర్ గ్రీన్ గా ప్లే అవుతుంటాయి. ఐటెం సాంగ్స్ గురించి అయితే స్పెషల్ గా చెప్పుకోవాలి. ఆర్యలో ‘అ అంటే అమలాపురం’ పాట ఒక జనరేషన్ ని ఊపేసింది. ఆర్య2లో ‘రింగ రింగా’.. అయితే మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అదరగొట్టింది. […]

Card image cap

ఈవారం బాక్సాఫీస్‌: 8 సినిమాల‌తో జాత‌ర‌

డిసెంబ‌రు అంతా కొత్త సినిమాల‌తో టాలీవుడ్ క‌ళ‌క‌ళ‌లాడిపోనుంది. దానికి త‌గ్గ‌ట్టే అఖండ‌తో మంచి బూస్ట‌ప్ వ‌చ్చింది. డిసెంబ‌రు 17న పుష్ఫ వ‌స్తోంది. ఆ త‌ర‌వాత శ్యాం సింగ‌రాయ్ ఉంది. దాంతో డిసెంబ‌రు అయిపోతుంది. ఆ వెంట‌నే సంక్రాంతి సీజ‌న్ మొద‌లైపోతుంది. చిన్న‌, మీడియం సినిమాల‌కు ఉన్న గ్యాప్ ఈ వారం మాత్ర‌మే. అందుకే ఏకంగా 8 సినిమాలు ఈ వారం విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. వ‌స్తున్న సినిమాలు 8 ఉన్నా, అంద‌రి దృష్టి ల‌క్ష్య‌, గ‌మ‌నంపైనే. నాగ‌శౌర్య క‌థానాయ‌కుడిగా […]

Card image cap

ద‌ర్శ‌కేంద్రుడి ‘సీత చెప్పిన రామాయ‌ణం’

రామాయ‌ణ‌, మ‌హా భార‌త గాధ‌ల్ని ఎన్నిసార్లు చెప్పినా – అందులో ఏదో ఓ కోణం మిగిలే ఉంటుంది. ఆఖ‌రికి క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు కూడా అందులో పాయింట్లు తీసుకుని, వాటి ఆధారంగా రూపొందించిన‌వే. ఇప్ప‌టి ఆధునిక ప‌రిజ్ఞానంతో రామాయ‌ణ‌, మ‌హాభార‌త గాథ‌ల్ని తీస్తే… మరింత‌గాజ‌నాల‌కు చేరువ అవుతుంద‌న్న‌ది ద‌ర్శ‌క నిర్మాత‌ల న‌మ్మ‌కం. అందుకే.. రాజ‌మౌళి మ‌హాభార‌తం పై దృష్టి పెట్టాడు. ఎప్ప‌టికైనా మ‌హాభార‌తం తీస్తాన‌ని ప్ర‌క‌టించాడు. ఇప్పుడు రాజ‌మౌళి గురువు.. రాఘ‌వేంద్ర‌రావు రామాయ‌ణం తీయ‌డానికి రెడీ అయ్యారు. రాఘ‌వేంద్ర‌రావు […]

Card image cap

విశాఖలో సముద్రం అలజడి.. నాసా నివేదికలు నిజమవుతాయా !?

విశాఖలో ఆదివారం ఆహ్లాదంగా బీచ్ ఒడ్డున గడపాలనుకున్న ప్రజలకు ఆందోళన కనిపించే దృశ్యాలు కనిపించాయి. సముద్రం ఒక్క సారిగా ముందుకు వచ్చింది. మరో చోట పూర్తిగా వెనక్కి వెళ్లింది. అలలు మూడు మీటర్ల ఎత్తున ఎగసి, సముద్రం తీరం వైపు చొచ్చుకొచ్చింది. అలల తాకిడికి బీచ్‌రోడ్డులోని చిల్డ్రన్‌పార్క్‌ ప్రహరీకూలిపోయింది. సుమారు 500 అడుగుల పొడవున 2-3 అడుగుల లోతున మట్టి జారిపోయింది. మరో చోట గతంలో కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ ఓడ ఉన్న చోట సముద్రం వెనక్కి పోయింది. […]

Card image cap

కేసీఆర్ “ధరణి”పై దృష్టి పెట్టాల్సిందే !

“ధరణి”అనే వ్యవస్థను తీసుకు వచ్చి భూ సమస్యలు… వివాదాలు లేకుండా చేస్తామన్న కేసీఆర్‌కు ఇప్పుడు ఆ వ్యవస్థ చుక్కలు చూపిస్తోంది. అందులో ఎన్నో లోపాలు బయటపడుతున్నాయి. దాదాపుగా ప్రతీ గ్రామంలోనూ భూ సమస్యలు కనిపిస్తున్నాయి. సమస్యలను సులువుగా పరిష్కరించడానికి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఉద్దేశించిన ధరణి వ్యవస్థ కొత్త కష్టాలను తెచ్చింది. సంక్లిష్టంగా మారి ఎవ్వరికీ అంతుచిక్కని రహస్యంగా తయారైందన్న ఆరోపణలు.. విమర్శళు ఎక్కువగా వస్తున్నాయి. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం క్షేత్రస్థాయిలో సక్రమంగా […]

Card image cap

“రూ. 50 లక్షల ఆఫర్‌”కు పరిటాల ఫ్యాన్స్ సపోర్ట్ !

చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ కుమార్తె అయిన నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అసెంబ్లీ వేదికగా బయట చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. కారణం ఏదైనా వివాదాన్ని ముగించడానికి వల్లభనేని వంశీతో క్షమాపణలు చెప్పించారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కన్నీళ్లతో భువనేశ్వరి కాళ్లు కడుగుతామనే మాటలు చెప్పడం ప్రారంభించారు. అదే సమయంలో మల్లాదివాసు అనే టీఆర్ఎస్ కార్పొరేటర్ కులం కోణంలో .. భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అంతమొందిస్తే రూ.50 […]