‘పెళ్లి సంద‌D’ ట్రైల‌ర్‌: న‌టుడిగా ద‌ర్శ‌కేంద్రుడి అరంగేట్రం



కొంత‌మంది ద‌ర్శ‌కుల‌కు తెర‌పై మెర‌వాల‌ని ఉంటుంది. అందుకే చిన్న చిన్న పాత్ర‌ల్లో త‌ళుక్కున మెరిసి వెళ్తుంటారు. వంద సినిమాలు చేసినా, ఒక్క సినిమాలోనూ, ఒక్క ఫ్రేమ్ లోనూ క‌నిపించ‌లేదు రాఘ‌వేంద్ర‌రావు. ఇప్పుడెందుకో ఆయ‌న‌కు కెమెరాముందుకు రావాల‌ని పించింది. ఆయ‌న్ని న‌టుడిగా అరంగేట్రం చేయించింది `పెళ్లి సంద‌D`. శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్ర‌మిది. శ్రీ‌లీలా క‌థానాయిక‌. ద‌స‌రాకి ఈ సినిమా విడుద‌ల కానుంది. ఈరోజు ట్రైల‌ర్ వ‌చ్చేసింది. ఈ చిత్రానికి రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేశారు. […]