‘రిప‌బ్లిక్’ ట్రైల‌ర్‌: పాల‌నా వ్య‌వ‌స్థ‌పై పాసుప‌తాస్త్రం



చ‌ట్టాలెందుకున్నాయి? న్యాయ స్థానాల విధేమిటి? ప‌రిపాల‌నా వ్య‌వ‌స్థ ల‌క్ష్య‌మేంటి? ఉద్యోగుల ధ‌ర్మేమేంటి? ఈ ప్ర‌శ్న‌ల‌కు ఒకే ఒక్క స‌మాధానం. ప్ర‌జ‌ల కోసం. అయితే.. న్యాయం, చ‌ట్టం, ఉద్యోగ వ్య‌వ‌స్థ ఇవ‌న్నీ పాల‌కుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ప్ర‌జ‌ల హ‌క్కుల‌, ర‌క్ష‌ణ ఇవ‌న్నీ గాలికొదిలేస్తున్నారు. దాంతో వ్య‌వ‌స్థ గాడి త‌ప్పుతోంది. ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వాల‌పై, ప్ర‌జ‌ల‌పై న‌మ్మ‌కం పోతోంది. ఇలాంట‌ప్పుడు ఏం చేయాలి? ఈ పోరాటానికి ఎవ‌రు రావాలి? ఈ ప్ర‌శ్న‌లు సంధిస్తోంది `రిప‌బ్లిక్‌`. సాయిధ‌ర‌మ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్ర‌మిది. […]