‘శంకరాచార్య‌’గా బాల‌కృష్ణ‌ప్ర‌యోగాలు చేయ‌డంలో ఎప్పుడూ ముందుండే వ్య‌క్తి నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఆయ‌న అన్ని ర‌కాల జోన‌ర్ల‌నీ ట‌చ్ చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న దృష్టి శంక‌రాచార్య పాత్ర‌పై ప‌డింది. హైంధ‌వ ధ‌ర్మాన్ని ప్ర‌చారం చేసిన మ‌హోన్న‌త వ్య‌క్తి. అత‌ని జీవితాన్ని తెర‌పై చూపించాల‌న్న‌ది బాల‌కృష్ణ ప్ర‌య‌త్నం. దానికి సంబంధించిన స్క్రిప్టు కూడా త‌యార‌వుతోంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి సి.క‌ల్యాణ్ కూడా స‌ముఖంగా ఉన్నారు. బాల‌య్య‌తో క‌ల్యాణ్‌కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో రెండు సినిమాలొచ్చాయి. మూడో సినిమా […]