“అన్నమయ్య”పై కదిలిన కేంద్రం.. రాష్ట్రం కవరింగ్ !అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిన విషాదం వెనుక తప్పిదం ఎవరిదో తేల్చి శిక్షించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పిన కేంద్ర మంత్రి షెకావత్‌పై వైసీపీ నేతలు దారుణమైన విమర్శలు చేయడంతో బీజేపీ హైకమాండ్‌కు అనేక ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో వెంటనే అన్నమయ్య ప్రాజెక్ట్ విషాదానికి కారణం ఏమిటో తేల్చేందుకు ప్రత్యేకంగా కమిటీని నియమించాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రికార్డులు పరిశీలించి.. క్షేత్ర స్థాయిలో పర్యటించి ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. […]