“వైట్ చాలెంజ్‌”తో రేవంత్ హడావుడి !



టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పేరును డ్రగ్స్ వ్యవహారంలో మరింతగా నాన్చే వ్యూహం అవలంభిస్తున్నారు. కొద్ది రోజులుగా డ్రగ్స్ కేసు విషయంలో కేటీఆర్‌ పేరును తీసుకు రావాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. గతంలో గోవాకు వెళ్లారని.. మరొకటని ఆయన చెబుతూ వస్తున్నారు. అయితే కేటీఆర్ స్పందించకపోవడంతో అవి ఆరోపణలుగానే ఉండిపోయాయి. అదే సమయంలో రేవంత్ రెడ్డి తన పార్టీ నేత జడ్సన్‌తో ఎన్‌ఫోర్స్మెంట్‌ డైరక్టరేట్‌కు లేఖ రాయించారు. […]