అయినా .. కర్నూలుకే కార్యాలయాల తరలింపు !మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.కానీ కార్యాలయాల తరలింపును మాత్రం ఆపడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని గెజిట్ జారీ చేసింది. వక్ఫ్‌ భూముల పరిరక్షణకు సంబంధించి న్యాయపరమైన అంశాలను వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ విచారణ జరుపుతుంది. ఇప్పటి వరకూ ఈ ట్రిబ్యునల్ హైదరాబాద్‌లో ఉంది. కార్యాలయాల తరలింపు విషయంలో హైకోర్టు స్టే ఉంది. ఇటీవల మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకున్న తర్వాత కూడా […]