ఉద్యోగ సంఘాల్లో వైసీపీ మార్క్ విభజన !ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు నిరసనలు ప్రారంభించాయి. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామన్న జగన్ మాటను ఉద్యోగులు నమ్మడం లేదు. ఒక్క పీఆర్సీ కాదు ఇంకో 70 సమస్యలు ఉన్నాయని బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు అనే ఇద్దరు నేతలు చెలరేగిపోతున్నారు. వీరిద్దరినీ నిన్నామొన్నటి వరకూ కంట్రోల్‌లో పెట్టిన సజ్జల ఇప్పుడు ఎందుకో కానీ పెద్దగా దృష్టి పెట్టడం లేదు. దీంతో వారు స్వేచ్చగా ఉద్యమం చేసుకుంటున్నారు. నిరసనలు ప్రారంభించారు. ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే వైసీపీ వ్యూహం […]