కరోనా బాధిత జర్నలిస్టు కుటుంబాలకు తెలంగాణ సర్కార్ అండ !జర్నలిస్టుల సంక్షేమంలో మాటలు చెప్పడం కన్నా అంతో ఇంతో ఆచరణలో చూపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గతంలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు రూ. ఇరవై వేల చొప్పున ఇచ్చిన ప్రభుత్వం.. ఆ మహమ్మారి బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలకూ అండగా ఉంటోంది. కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. రెండు లక్షలు.. ఇతర కారణాలతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. పదిహేనో తేదీన ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు […]