కరోనా భయపెడుతోంది సారూ.. కాస్త అణిచివేయకూడదూ..!?



రాజకీయం తీరెరుగదు – పూటకూళ్ళమ్మ పుణ్యమెరుగదంటారు…! ఇదెంత నిజమో కానీ.. భయపెట్టి పాలన సాగించేస్తున్నారని.. ఎవరు నోరెత్తినా కేసులు.. అరెస్టులు.. దాడులు.. దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు తెర ముందుకు ముందుకు వచ్చి గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారు. ప్రజల్ని ఎవరు భయపెట్టినా ఊరుకోబోమని… కఠినంగా అణిచివేస్తామని .. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇదంతా తమ గురించి కాదు.. ప్రతిపక్ష నేతలు.. మీడియా గురించే. కరోనా గురించి చెప్పి.. చెప్పి ప్రజల్ని భయపెడుతున్నారట. […]