కేసీఆర్‌కు రావాల్సిన ఈడీ నోటీసులు ఆగిపోయాయంటున్న రేవంత్ !పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు ఆందోళన చేశారు..? . ధాన్యం కొనుగోళ్ల విషయంలో క్లారిటీ ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. మరి ఎందుకు విరమించారు..? ఎందుకు అసలు సభకే డుమ్మా కొట్టాలనుకున్నారు..? ఇది మాత్రం ఎవరికీ తెలియదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనలు.. విరమణ వెనుక ఉన్నది ఈడీ నోటీసుల వ్యవహారమని అంటున్నారు. కేసీఆర్‌ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లుగా కేంద్రం వద్ద ఆధారాలున్నాయని.. ఈడీ నోటీసులు పంపిస్తారని తెలిసిన తర్వాతే ఆయన […]