క్లైమాక్స్‌పై ఆధార‌ప‌డిన ‘ల‌వ్ స్టోరీ’ జాత‌కం



చాలాకాలం త‌ర‌వాత‌… బాక్సాఫీసు ద‌గ్గ‌ర కాస్త హంగామా క‌నిపిస్తోంది.. లవ్ స్టోరీ వ‌ల్ల‌. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌కత్వం వ‌హించిన సినిమా ఇది. నాగ‌చైత‌న్య – సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించారు. శేఖ‌ర్ పై ఉన్న న‌మ్మ‌కం…. సాయి ప‌ల్ల‌విపై ఉన్న అభిమానం, అన్నింటికంటే ముఖ్యంగా `సారంగ ద‌రియా`పై ఉన్న ప్రేమ వ‌ల్ల‌… `ల‌వ్ స్టోరీ` అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజులో సాగుతున్నాయి. నిజంగా టాలీవుడ్ కి ఇది శుభ శ‌కునం. తొలి మూడు రోజులూ థియేట‌ర్లు నిండిపోవ‌డం […]