జగన్‌దే కాదు సీబీఐదీ అదే వాదన ! మరి తీర్పు ?అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ పెట్టుకున్న పిటిషన్‌ను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి అవకాశం ఇవ్వవొద్దని హైకోర్టులో వాదనలు వినిపించింది. సాక్షులను ప్రభావితం చేస్తారన్న కారణంగానే గతంలో హైకోర్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వలేదని .. ఇప్పుడు జగన్ హోదా పెరిగినందున మరితంగా సాక్షాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ స్పష్టం చేసింది. పదేళ్లుగా అక్రమాస్తుల కేసుల విచారణ ముందుకు సాగకుండా రకరకాల పిటిషన్లు వేస్తున్నారని.. […]