టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేస్తారా !?రైతుల కోసం అవసరం అయితే రాజీనామా చేస్తామంటూ టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ , ఎంపీ కే.కేశవరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆయన ఆ మాటలు ఊరకనే అని ఉండరని..ఎదో వ్యూహంతోనే అని ఉంటారన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. కేంద్రంతో తాడో పేడో తేల్చుకునే దిశలో రైతుల కోసం అవసరం అయితే పదవులు కూడా వదులుకుంటామని సంకేతం పంపేందుకు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో టీఆర్ఎస్‌కు ఏడుగురు […]