తెలంగాణలో “బియ్యం స్కాం” బద్దలవబోతోందా !?తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆ ఆంశంపైనే దృష్టి కేంద్రీకరించి బీజేపీని నిలుపుదల చేయాలని చూస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్ ఊహించని విధంగా ఎదురుదాడి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్‌లో బియ్యం కొనుగోలు అంశంలో పీయూష్ గోయల్ ఇచ్చిన సమాధానంలో తెలంగాణలో బియ్యం సేకరణలో భారీ అవకవకలు గుర్తించామని ప్రకటించారు. సరిగ్గా ఇదే అంశంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చాలా రోజులుగా విమర్శలు చేస్తున్నారు. […]