పెళ్లి లైవ్‌లో చూపిస్తే.. వంద కోట్లుబాలీవుడ్ లో మేట‌రే వేరు. అక్క‌డ దేన్న‌యినా స‌రే ప్ర‌చారంగా, వ్యాపారంగా మార్చేసుకుంటుంటారు. ఆఖ‌రికి పెళ్లి కూడా. సెల‌బ్రెటీలు ప్రేమించి పెళ్లి చేసుకుంటేవిప‌రీత‌మైన మైలేజీ. ఇప్పుడు క‌త్రినా – విక్కీల పెళ్లికీ అంత‌టి మైలేజీ ఉంది. ఈనెల 9న వీరిద్ద‌రి పెళ్లి రాజ‌స్థాన్‌లో జ‌ర‌గ‌బోతోంది. పెళ్లికి నెల రోజుల ముందు నుంచీ… వీళ్ల‌దే హ‌డావుడి అంతా. బాలీవుడ్ అంతా.. ఈ పెళ్లిపై ప్ర‌త్యేక‌మైన దృష్టి పెట్టింది. రాజ‌స్థాన్ లోని సిక్స్‌సెన్సెస్ ఫోర్టులో కత్రినా- విక్కీల పెళ్లి జ‌ర‌గ‌బోతోంది. […]