ప్రాథమిక ఆధారాల్లేకుండా సెలబ్రిటీలను ఈడీ ప్రశ్నించిందా !?సినీ తారలపై డ్రగ్స్ కేసుల్లో ఈడీ కేసులు తేలిపోయాయి. ప్రాథమిక ఆధారాలు కూడా లేవన్న కారణంతో ఆ కేసుల్ని ముగించేయాలని ఈడీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండానే ఈడీ ఎందుకు కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించిందనేది ఇప్పుడు ఆసక్తికరకంగా మారింది. ఎప్పుడో 2017లో తెలంగాణ పోలీసులు నమోదు చేసి.. సినీ తారలను ప్రశ్నించిన కేసును తీసుకున్న ఈడీ తాము కూడా నాలుగేళ్ల తర్వాత రంగంలోకి దిగింది. హఠాత్తుగా అందర్నీ ప్రశ్నించింది. […]