బాల‌య్య ఉదార‌త‌… చిన్నారికి సాయం



మ‌న హీరోలు తెర‌పైనే కాదు. బ‌య‌ట కూడా హీరోలే. త‌మ ఉదార‌త‌ని చాటుకునే అవ‌కాశం ఎప్పుడొచ్చినా – స్పందిస్తుంటారు. మాన‌వ‌త్వం చూపిస్తుంటారు. ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ కూడా అదే చేశారు. ఓ చిన్నారి వైద్యం కోసం త‌న వంతు సాయం చేశారు. వివ‌రాల్లోకి వెళ్తే… హైద‌రాబాద్ మ‌ల్కాజ్‌గిరికి చెందిన ఏడేళ్ల బాలిక మ‌ణిశ్రీ‌. కొంత‌కాలంగా కేన్స‌ర్‌తో బాధ‌ప‌డుతోంది. నాలుగు నెల‌ల క్రితం బ‌స‌వ‌తార‌కం ఆసుప‌త్రిలో చేరి, చికిత్స పొందింది. వైద్యం నిమిత్తం సుమారు 7 ల‌క్ష‌లు కావ‌ల్సివ‌చ్చింది. […]