బిపిన్ రావత్ హెలికాఫ్టర్ ఎలా కూలింది? అసలు కారణాలేంటి ?భారత త్రివిధ దళాల అధిపతి అంటే ప్రధానమంత్రి కంటే ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే మొత్తం రక్షణ వ్యవస్థ ఆయన చేతుల్లో ఉంటుంది. అందుకే ఆయన ప్రతి అడుగులోనూ వ్యవస్థ మొత్తం అప్రమత్తంగా ఉంటుంది. అలాంటి ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ఒక్క సారిగా కుప్పకూలింది. గాల్లో మంటలు అంటున్నట్లుగా కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రాష్ ల్యాండింగ్ అయినట్లుగా మరికొన్ని వీడియోలు కనిపిస్తున్నాయి. ఏం జరిగిందన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. బిపిన్ రావత్ ప్రయాణించిన […]