భారత త్రివిధ దళాల చీఫ్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌కు ప్రమాదం !భారత త్రివిధ దళాల చీఫ్‌గా ఉన్న బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ తమిళనాడులోని కూనూరు దగ్గర కూలిపోయింది. పర్వాత ప్రాంతాలైన నీలగిరీస్ జిల్లాలో ఇది ఉంది. ఓ ఆర్మీ సంబంధిత కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్కడకు వెళ్లారు. కుటుంబసభ్యులతో కలిసి ఎంఐ 17 హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తున్న సమయంలో హఠాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయనకు ఏమైనా గాయాలయ్యాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై ప్రభుత్వం పూర్తి స్థాయి గోప్యత పాటిస్తోంది. కేంద్ర ప్రభుత్వమే అధికారిక […]