రైతులకు సీమ ప్రజల మద్దతును “వైసీపీ మేధావులు” డిసైడ్ చేస్తారా !?అమరావతి రైతుల పాదయాత్ర చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. నెల్లూరు వరకూ కోస్తా ప్రాంతం కిందకు వచ్చినా చిత్తూరు మాత్రం రాయలసీమ కిందకు వస్తుంది. అక్కడా రైతులకు అనూహ్యైన స్వాగతం లభిస్తోంది. అధికార బలాన్ని ఉపయోగించుకుని వైసీపీ ఎమ్మెల్యేలు.. ఇతర నేతలు రైతులకు సాయం చేసిన వారిపై కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ సహకరించడానికి చాలా మంది ముందుకువస్తున్నారు. దీంతో సహజంగానే రాజధాని రైతులకు సీమ ప్రజల మద్దతు ఉందన్న అభిప్రాయం బలంగా వినిపించడం ప్రారంభమయింది. అయితే […]