విశాఖలో సముద్రం అలజడి.. నాసా నివేదికలు నిజమవుతాయా !?విశాఖలో ఆదివారం ఆహ్లాదంగా బీచ్ ఒడ్డున గడపాలనుకున్న ప్రజలకు ఆందోళన కనిపించే దృశ్యాలు కనిపించాయి. సముద్రం ఒక్క సారిగా ముందుకు వచ్చింది. మరో చోట పూర్తిగా వెనక్కి వెళ్లింది. అలలు మూడు మీటర్ల ఎత్తున ఎగసి, సముద్రం తీరం వైపు చొచ్చుకొచ్చింది. అలల తాకిడికి బీచ్‌రోడ్డులోని చిల్డ్రన్‌పార్క్‌ ప్రహరీకూలిపోయింది. సుమారు 500 అడుగుల పొడవున 2-3 అడుగుల లోతున మట్టి జారిపోయింది. మరో చోట గతంలో కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ ఓడ ఉన్న చోట సముద్రం వెనక్కి పోయింది. […]