హెలికాఫ్టర్ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కన్నుమూత !భారత సైనిక దళాల చీఫ్ బిపిన్ రావత్ హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఉదయం తమిళనాడులోని వెల్లింగ్టన్‌లో ఉన్న ఆర్మీ స్టాఫ్ కాలేజీలో శిక్షణ పొందిన వారిని ఉద్దేశించి ప్రసంగించేందుకు కోయంబత్తూరు నుంచి సైనిక హెలికాఫ్టర్‌లో బయలుదేరారు. ఆయనతో పాటు భార్య మధులికతో పాటు మరికొంత మంది ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారు. అయితే అనూహ్యంగా మరో పది నిమిషాల్లో స్టాఫ్ కాలేజీకి చేరుకుంటారనగా.. కన్నూరు వద్ద హెలికాఫ్టర్ కూలిపోయింది. ప్రతికూల వాతావరణం లేకపోయినా.. ప్రపంచంలోనే ది బెస్ట్ అనే […]