Telugu 360 Telugu

Card image cap

ఆ పరిస్థితి వస్తే ఆత్మహత్య చేసుకోవడం మేలు : రేవంత్

కుటుంబసభ్యల ఫోన్లను ట్యాపింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఆత్మహత్య చేసుకోవడం మేలు అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సొంత కుటుంబసభ్యుల ఫోన్ కాల్స్ వినాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హాయంలో తన ఫోన్ ట్యాపింగ్ కాలేదని అనుకుంటున్నానని.. ఫోన్ ట్యాపింగ్ అయ్యి ఉంటే సిట్ అధికారులు తనకు నోటీసులు ఇచ్చేవారని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చట్టవ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. […]

Card image cap

రేవంత్ రాజకీయం: దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి !

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాల్లో పీహెచ్‌డీలు చాలా చేశారు. ఇతర పార్టీలను ఇరుకున పెట్డడానికి ఆయన చేసే డిమాండ్లు అలాగే ఉంటాయి. కులగణనపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకంటూ ఢిల్లీ వెళ్లిన రేవంత్ ఓ ప్రెస్మీట్ పెట్టారు. అందులో ఉపరాష్ట్రపతి పదవిని దత్తాత్రేయకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పదవికి ..బీసీలకు లింక్ పెట్టేశారు. దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా బీసీలను గౌరవించినట్లుగా అని.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గుర్తించినట్లుగా అని రేవంత్ చెబుతున్నారు. అదే […]

Card image cap

చంద్రబాబుతో 5 నిమిషాలు మాట్లాడాం.. పెట్టుబడులతో వచ్చాం : యూఏఈ ఆర్థిక మంత్రి

దావోస్‌లో చంద్రబాబుతో ఐదు అంటే ఐదు నిమిషాలు మాట్లాడామని ఆయన విజన్ నచ్చి..ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాడనికి వచ్చామని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌఖ్ అల్ మర్రీ చెప్పారు. విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్ ఈవెంట్ జరిగింది. ఇందులో గల్ఫ్ దేశాల నుంచి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. సీఐఐ ఈ సమావేశాన్ని సమన్వయం చేసింది. ఈ సమ్మిట్ లో చంద్రబాబు ఏపీలో ఉన్న అవకాశాలను వివరించారు. డ్రోన్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ […]

Card image cap

సీఐడీ సంజయ్‌కు ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు ఆశ్చర్యం!

అగ్నిమాపక శాఖ డీజీగా పని చేసినప్పుడు చేసిన అవినీతి వ్యవహారంలో నమోదైన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ సీఐజీ చీఫ్ సంజయ్‌కు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ తీర్పును చూసి సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. చాలా పేజీలున్న తీర్పును చూసి.. ముందస్తు బెయిల్ పై పిటిషన్ వేస్తే.. అసుల కేసు మొత్తం విచారణ జరిపినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ కేసులో అవినీతికి పాల్పడినట్లుగా సాక్ష్యాలు అయిన ఇన్వాయిస్‌లు, ఒప్పంద పత్రాలను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. […]

Card image cap

రాజాసింగ్‌కు అర్థమవుతున్న రాజకీయం !

బీజేపీకి రాజీనామా చేసిన ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి బీజేపీ అడిగితేనే రాజీనామా చేస్తానంటున్నారు. పార్టీకి చేసిన రాజీనామాను బుజ్జగించి వెనక్కి తీసుకునేలా చేస్తారని అనుకున్నారు కానీ ఆమోదించి పక్కన పడేసేసరికి రాజాసింగ్ కు లైట్లు వెలిగాయి. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశానని.. కిషన్ రెడ్డికి పంపానని ఆయన స్పీకర్ కు పంపవచ్చని మొదట్లో ప్రకటనలు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం బీజేపీ హైకమాండ్ చెబితే రాజీనామా చేస్తానని అంటున్నారు. బీజేపీకి ఆయన రాజీనామా అవసరం లేదు. […]

Card image cap

డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు కథలన్నీ బయటకు ?

డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన కేసులో పునర్విచారణకు కోర్టు అనుమతించడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగనుంది. ఈ హత్య తానే చేసినట్లుగా ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించారు. అయితే ఎందుకు హత్య చేశారు.. ఒక్కడే చేశాడా.. అతనికి ఎవరు సహకరించారు.. అన్నదానిపై ఎలాంటి వివరాలు లేవు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు హత్య చేయడంతో మీడియాలో హడావుడి జరిగింది కాబట్టే కేసు నమోదు చేశారు. తూతూ మంత్రంగా దర్యాప్తు చేశారు. నిజానికి అసలు దర్యాప్తు చేయలేదు. అనంతబాబు చెప్పింది […]

Card image cap

‘కురుప్పు’ టీజ‌ర్‌: ఐకానిక్ మూమెంట్స్ గుర్తు చేసిన సూర్య‌

త‌మిళ న‌టుడు సూర్య ప్ర‌యోగాల‌కు పెట్టింది పేరు. కొత్త కొత్త జోన‌ర్లు, క‌థ‌లు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేస్తాడు. త‌ను మాస్ సినిమాలు చేసిన ప్ర‌తీసారీ… మంచి ఫ‌లితాలే వ‌చ్చాయి. ఇప్పుడు చేసిన ‘కురుప్పు’ కూడా మాస్ మీల్సే అనిపిస్తోంది. త్రిష క‌థానాయిక‌గా నటించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియ‌ర్స్ సంస్థ నిర్మించింది. ఆర్‌.జే.బీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సూర్య పుట్టిన రోజు సంద‌ర్భంగా టీజ‌ర్ ఈరోజు విడుద‌ల చేశారు. ”కొబ్బ‌రికాయ కొట్టి క‌ర్పూరం వెలిగిస్తే శాంతించే దేవుడు కాదు… […]

Card image cap

హైదరాబాద్‌లో 62 అంతస్తుల అపార్టుమెంట్ !

హైదరాబాద్ లో ఆకాశహర్మ్యాల నిర్మాణంలో డెవలపర్లు ఏ మాత్రం తగ్గడం లేదు. ఎత్తు పెంచుకుటూనే పోతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో అత్యంత ఎత్తైన భవనం SAS క్రౌన్. ఇది 58 అంతస్తులు ఉంది. మొత్తంగా 772 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇప్పుడు దాన్ని మించిపోయే నిర్మాణం కోసం ఓ డెవలపర్ రెడీ అయ్యారు. అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. ఆ డెవలపర్‌కు ప్రభుత్వంలో కూడా పట్టు ఉండటంతో అనుమతులు ఖాయమనేని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ […]

Card image cap

ఏపీలో రియల్ ఎస్టేట్‌కు మరో గుడ్ న్యూస్ – ఫీజు తగ్గింపు !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి విధివిధానాలను సరళం చేశారు. ఒక్క రూపాయికే ఇంటి ప్లాన్లు అందించే ఏర్పాటు కూడా చేశారు. తాజాగా డెవలప్‌మెంట్ అగ్రిమెంట్లు మరియు సేల్ కం జీపీఏ (GPA) ఒప్పందాలపై స్టాంప్ డ్యూటీని తగ్గించే కీలక నిర్ణయం తీసుకుంది. డెవలప్‌మెంట్ అగ్రిమెంట్లపై స్టాంప్ డ్యూటీని 4 నుంచి 1 శాతానికి తగ్గించారు. ఈ తగ్గింపు రియల్ ఎస్టేట్ డెవలపర్లకు […]

Card image cap

అన్నిటా.. అంత‌టా.. వీర‌మ‌ల్లునే

‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’ మ‌రి కొద్ది గంట్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈలోగా వీర‌మ‌ల్లు ఫీవ‌ర్ తెలుగు రాష్ట్రాల్లో పాకేసింది. ఎక్క‌డ చూసినా వీర‌మ‌ల్లు టాపిక్కే. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఈ సినిమాని ప‌ట్టించుకొన్న‌దే లేదు. ఫ్యాన్స్ కూడా ఎప్పుడూ ‘ఓజీ… ఓజీ’ అంటూ అరిచారు కానీ, వీర‌మ‌ల్లు పై వాళ్లూ పెద్ద‌గా ఫోక‌స్ చేయ‌లేదు. కానీ వారంలోనే సీన్ మొత్తం మారిపోయింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రెస్ మీట్‌కి రావ‌డం, ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ స‌క్సెస్ కావ‌డంతో […]

Card image cap

బీహార్‌లో 35 లక్షల ఓట్ల తొలగింపు !

బీహార్ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటి వరకూ చేసిన పరిశీలన ప్రకారం 35 లక్షలకుపైగా ఓటర్లను తొలగించనున్నారు. సవరణ ప్రక్రియ సెప్టెంబర్ 30 వరకూ కొనసాగుతుంది. ఇప్పటి వరకూ సుమారు 35.5 లక్షల ఓటర్లు అసలు ఓటర్లు కాదని గుర్తించారు. 12.5 లక్షల మంది మరణించిన వారి పేర్లు, 17.5 లక్షల మంది బీహార్ నుంచి శాశ్వతంగా వలస వెళ్లినవారు, 5.5 లక్షల మంది […]

Card image cap

మరో సారి ఢిల్లీకి రేవంత్ – రిజర్వేషన్ల గండం దాటేదెలా ?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. బిసీ రిజర్వేషన్లకు తాత్కాలికంగా ఆయినా ఆమోదం పొందడం ఆయన టార్గెట్. ఇప్పటికే ఆర్డినెన్స్ రాజ్ భవన్‌కు పంపించారు. ఆ ఆర్జినెన్స్ కు ఆమోద ముద్ర వేయించుకుంటే.. తాత్కాలికంగా స్థానిక ఎన్నికల గండాన్ని గట్టెక్కవచ్చని రేవంత్ రెడ్డి అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇందు కోసం బీజేపీ, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. అలాగే కులగణనపై కాంగ్రెస్ […]

Card image cap

ఎమ్మెల్యేల బాధలూ వింటున్న చంద్రబాబు !

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు .. ఎమ్మెల్యేలకు సమయం ఇస్తున్నారు. తనను కలవాలని అనుకుంటున్న వారిని, తాను కలవాలని అనుకుంటున్న వారిని ఆయన సమయంను బట్టి పిలుస్తున్నారు. రోజుకు ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలకు సమయం ఇస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు తమ సమస్యలు,కష్టాలు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గ సమస్యలను వివరిస్తున్నారు. పార్టీ పరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు కూడా వారితో సమావేశానికి ముందే మొత్తం సమాచారం తెప్పించుకుని. ..వారి తప్పులు ఉంటే గట్టిగానే హెచ్చరికలు […]

Card image cap

ఉపరాష్ట్రపతి: ఉపఎన్నికే అయినా పూర్తి పదవి కాలం !

ఉపరాష్ట్రపతి రాజీనామా చేశారు. ఆమోదం పూర్తి అయింది. ఎన్నికల సంఘం శరవేగంగా ఎన్నిక ప్రక్రియ చేపడుతుంది. ఆరు నెలల గడువు ఈ పదవికి వర్తించదు. అంటే మరో వారంలోనే ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది . అయితే చాలా మందికి ఓ డౌట్ ఉంది. జరుగుతోంది ఉపఎన్నికలు కాబట్టి.. మిగిలిన పదవి కాలం మాత్రమే ఉంటుందా లేకపోతే.. పూర్తి పదవి కాలం ఉంటుందా అన్నదే ఆ డౌట్. ఉపఎన్నిక అయినా ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యేవారు పూర్తి కాలం అంటే ఐదు […]

Card image cap

ఢిల్లీకి జగనట – ఎం చేయడానికో ?

లిక్కర్ కేసు తన దగ్గరకు వస్తూండటంతో జగన్మోహన్ రెడ్డి టెన్షన్ కు గురవుతున్నారు. ఈ కేసులో భారతి పాత్ర కూడా ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తూండటంతో కేసు ఆ దిశగా మలుపు తిరుగుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. దీంతో ఏదో ఓ డీల్ చేసుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే జగన్ ఢిల్లీకి వెళ్తున్నారన్న ప్రచారం ప్రారంభించారు. జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారన్నది వైసీపీ వర్గాలు చెప్పడం లేదు. తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి […]

Card image cap

చేసిన దానికే అనుభవిస్తున్నారు – ఇక వడ్డీలేలా?

మేము వస్తాం.. వడ్డీతో సహా చెల్లిస్తామని బెదిరిస్తూ ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోతున్నారు వైసీపీ నేతలు. ఇప్పటికీ తప్పుడు పనులు, మాటలు మానుకోవడం లేదు. వారికి అర్థం కాని విషయం ఏమిటంటే.. ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉండి కన్నూమిన్నూ కానరాకుండా చేసిన దానికే ఇప్పుడు అనుభవిస్తున్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల వల్లే ఇప్పుడు రోడ్డున పడ్డారు. మళ్లీ అధికారంలోకి వస్తామని ఎలా అనుకుంటున్నారు కానీ.. అధికారంలో ఉన్నప్పుడు చేసిన వాటికే ఇప్పుడు అనుభవిస్తున్నారన్న విషయాన్ని […]

Card image cap

జగన్‌ను అరెస్ట్ చేస్తే ఎమ్మెల్యేల రాజీనామాలు !

వైఎస్ఆర్‌సీపీ పక్కా ప్రణాళికతో రాజకీయాలు చేస్తోంది. లిక్కర్ స్కామ్‌లో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం ఖాయమని తేలిపోవడంతో తదుపరి వ్యూహంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఆందోళనలు చేయడంతో పాటు.. రాజీనామాల వ్యూహాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో పట్టుదలగా ఉన్నారు. రాజీనామా చేసి.. ప్రజాగ్రహం ఏమిటో ప్రభుత్వానికి తెలిసేలా చేయాలనుకుంటున్నారు. అందుకే ఎమ్మెల్యేలందరికీ.. రాజీనామాలకు సిద్ధంగా ఉండాలన్న సంకేతాలు పంపినట్లుగా చెబుతున్నారు. సానుభూతి ఉప్పొంగుతుందని అంచనా ఐదు సంవత్సరాల పాటు అద్భుతమైన […]

Card image cap

చెవిరెడ్డి డ్రామాలు అన్ లిమిటెడ్ !

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ మాత్రం తగ్గడం లేదు. ఖాళీగా జైలులో ఉంటూ.. బయటకు వస్తే ఎలాంటి డ్రామాలు వేయాలో మందుగానే ప్రాక్టీస్ చేస్తున్నారేమో కానీ. బయటకు వచ్చినప్పుడల్లా అరుపులు, కేకలతో దడదడలాడిస్తున్నారు. మంగళవారం కోర్టులో హాజరు పరిస్తే న్యాయమూర్తి ముందు తానే వాదనలు వినిపించుకున్నారు. ఆ వాదనలు ఏమిటంటే.. తన తండ్రి, సోదరుడు మద్యం కారణంగానే చనిపోయారని.. అందుకే తాను మద్యం జోలికి వెళ్లకూడదని అనుకున్నానని కానీ తనను మద్యం కేసులోనే అరెస్టు చేశారని ఆయన […]

Card image cap

కాకాణితో పాటు అనిల్‌కూ వాటా !

నెల్లూరులో క్వార్ట్జ్ అక్రమ తవ్వకం, తరలింపు, పేలుడు పదార్థాల కేసుల కీలక మలుపు చోటు చేసుకుంది. ఇందులో అనిల్ కుమార్ కూడా డబ్బులు దండుకున్న విషయం బయట పడింది. ఈ కేసులో శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన అనిల్ కుమార్ వ్యాపార భాగస్వామి. అతను క్వార్జ్ మైనింగ్ స్కాంలో అనిల్ పాత్రపై శ్రీకాంత్ రెడ్డి కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టినట్లుగా తెలుస్తోంది. “2023 ఆగస్టు నుంచి అనిల్, కాకాణితో కలిసి క్వార్జ్ […]

Card image cap

ట్యాపింగ్ కేసు సీబీఐకి వెళ్తే బెటరనుకుంటున్న బీఆర్ఎస్

ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ కొత్త డిమాండ్ వినిపించడం ప్రారంభించింది. సిట్ దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. గతంలో తన ఫోన్ ట్యాప్ చేశారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆయన ఫోన్ ట్యాప్ అయిందని సిట్ గుర్తించింది. బాధితుడిగా వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేస్తూంటే హాజరు కావడం లేదు. పైగా తనకు నోటీసులు రాక ముందే మీడియాకు […]

Card image cap

వైసీపీ చేతికి రాళ్లిచ్చిన అచ్చెన్నాయుడు !

మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ చేతికి రాళ్లు అందించారు. ఆడబిడ్డలకు రూ.1500 ఇచ్చే పథకం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని వ్యాఖ్యానించారు. సూపర్ సిక్స్ లో అన్ని పథకాల అమలు జరుగుతున్నాయని ఒక్క పథకమే పెండింగ్ లో ఉందని విజయనగరంలో జరిగిన తొలి అడుగు కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. అంతటితో ఆగిపోతే బాగుడేది.. ఆ ఒక్క పథకం అమలు చేయడానికి రాష్ట్రాన్ని అమ్మాల్సి ఉంటుందన్నారు. అయినా చంద్రబాబు ఆ పథకం అమలు […]

Card image cap

మాజీ ఎక్సైజ్ మంత్రి భయంతో అన్నీ చెప్పేస్తున్నారు !

ఏపీ లిక్కర్ స్కాంలో ఇప్పటి వరకూ పెద్దగా వినిపించని పేరు నారాయణ స్వామి. పేరుకు ఎక్సైజ్ మంత్రే అయిన చేతుల్లో ఏమీ ఉండేది కాదని అందరికీ తెలుసు. అందుకే సిట్ అధికారులు ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. కానీ సాక్షిగా అయినా వాంగ్మూలం కీలకం కాబట్టి నోటీసులు జారీ చేశారు.కానీ నారాయణ స్వామి తనకు హెల్త్ బాలేదని డుమ్మకొట్టారు.కానీ పోలీసుల్ని ఇంటికి పంపించి.. వీడియో క్వాల్ ద్వారా ఆయనను సిట్ అధికారులు ప్రశ్నించారు. వారు ఏం అడిగారో.. నారాయణ […]

Card image cap

ఉపరాష్ట్రపతిగా నితీష్ కుమార్ ?

ఉపరాష్ట్రపతి జగదీప్ థన్‌ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఇక ఉపరాష్ట్రపతి పదవికి ఉపఎన్నిక పదవికి ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించనుంది. అయితే ఇప్పుడు బీజేపీ పెద్దల దృష్టిలో ఉపరాష్ట్రపతి పదవికి ఎవరు ఉన్నారన్నది సస్పెన్స్ గా మారింది. పలు పేర్లు ప్రచారంలోకి వస్తున్నప్పటికీ.. ఒకే ఒక్క పేరుపై ఎక్కువ చర్చ జరుగుతోంది. ఆ పేరు బీహార్ సీఎం నితీష్ కుమార్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం బీజేపీకి ఇప్పుడు ఓ సవాల్ గా మారింది. సుదీర్ఘ […]

Card image cap

వీరమల్లుకి బూస్ట్‌ప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా చాలా ప్రతిష్టాత్మకంగా మొదలైంది. పవన్ చేస్తున్న తొలి పీరియాడిక్ సినిమా, అలాగే ఆయన హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో చేస్తున్న తొలి సినిమా కూడా ఇదే. పాన్ ఇండియా రేంజ్‌లో ప్లాన్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్‌కి ఉన్న పొలిటికల్ షెడ్యూల్‌, నిర్మాణ పరంగా వచ్చిన కొన్ని అవాంతరాలు కారణంగా చాలా కాలం పాటు ఈ సినిమా ప్రొడక్షన్‌లోనే ఉండిపోయింది. మధ్యలో దర్శకుడు కక్రిష్ తప్పుకున్నారు. సినిమా పూర్తి అయిన తర్వాత కూడా […]

Card image cap

వి.సా.రెడ్డి కుమార్తె, అల్లుడిపై కేసులు నమోదు !

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డి, అల్లుడు రోహిత్ రెడ్డిలపై కేసులు నమోదయ్యాయి. భీమిలి సముద్రతీరంలోని అక్రమ నిర్మాణాలపై ఈ కేసులు నమోదు చేశారు. ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్ మెంట్ అథారిటీ పర్యావరణ చట్టం నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిజానికి కేసులు పెట్టడం చాలా ఆలస్యం అయింది. హైకోర్టు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసిన తర్వాతనే కేసు నమోదు చేశారు. ఆ విషయం కూడా రహస్యంగా ఉంచారు. […]

Card image cap

ఎట్టకేలకు పెదవి విప్పిన క్రిష్

హరిహరవీరమల్లు సినిమాకి ఆద్యుడు దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి. ఆయన చెప్పిన కథ పవన్ కళ్యాణ్ నచ్చడంతో సినిమా సెట్స్‌కి వెళ్ళింది. అయితే సినిమా జాప్యం కావడంతో క్రిష్ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చారు. ఆయన స్థానంలో జ్యోతికృష్ణ దీన్ని పూర్తి చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చిన క్రిష్ ఎట్టకేలకు సినిమా గురించి పెదవి విప్పారు. తొలిసారిగా ఆయన స్పందన తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు, ఏఎం రత్నం […]

Card image cap

రాజీవ్ స్వగృహ ప్లాట్లు – తక్కువ ధరే !

తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ స్వగృహ పథకం కింద నిర్మించిన ఫ్లాట్లను విక్రయించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఫ్లాట్లు హైదరాబాద్‌లోని బండ్లగూడ , పోచారం ప్రాంతాల్లో ఉన్నాయి. తక్కువ ధరలకు ఫ్లాట్లు అందుబాటులో ఉండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. బండ్లగూడలో సహభావన టౌన్‌షిప్, పోచారం సద్భావన టౌన్‌షిప్ లలో ఈ ఫ్లాట్లు ఉన్నాయి. ఫ్లాట్ల ధరలు చదరపు అడుగుకు రూ.2,500 నుండి రూ.4,000 వరకు ఉన్నాయి, ఇవి మార్కెట్ ధరలతో పోలిస్తే చాలా తక్కువ. సింగిల్ బెడ్‌రూమ్ […]

Card image cap

వీరమల్లుకు ముగ్గురు దర్శకులు

పవన్ కళ్యాణ్ పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘హరి హర వీరమల్లు’. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. అయితే కొన్ని అనివార్యకారణాల వలన ఈ సినిమా సుధీర్గ కాలం ప్రొడక్షన్ లోనే వుండిపోయింది. దీంతో దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చేశారు. అయితే ఆయన బయటి రావడంలో ఎలాంటి వివాదం లేదు. పవన్ కూడా పరిస్థితిని అర్ధం చేసుకున్నారు. మిగిలిన సినిమాని నిర్మాత రత్నం కుమారుడు జ్యోతికృష్ణ పూర్తి చేశారు. ఈ […]

Card image cap

హైదరాబాద్ సౌత్ : పుంజుకుంటున్న రియల్ ఎస్టేట్

హైదరాబాద్ లోని నాలుగు జోన్లలో ఐటీకారిడార్ ఉన్న వెస్ట్ జోన్ హాట్ ప్రాపర్టీ. అందులో సందేహమే లేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే అందరూ వెస్ట్ జోన్ గురించే చెబుతారు. ఆలోచిస్తారు. దానికి తగ్గట్లుగానే ఆ ప్రాంతానికి మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో 50 శాతానికిపైగా భాగం ఉంది. తర్వాత నార్త్ జోన్ … మూడవ స్థానంలో సౌత్ జోన్ ఉంది. అంటే ఇరవై శాతంలోపే అక్కడ లావాదేవీలు జరుగతున్నాయి. కానీ దక్షిణ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ […]

Card image cap

అమరావతి భూసమీకరణ – ఇప్పటికి వెనక్కి తగ్గినట్లే !

అమరావతికి రెండో విడత భూసమీకరణపై ప్రభుత్వం ఇప్పటికి వెనక్కి తగ్గినట్లుగానే కనిపిస్తోంది. ప్రస్తుతం అమరావతి పనులు జోరుగా సాగుతున్నా.. ఇంకా ప్రజల్లో నమ్మకం బలపడలేదు. పూర్తి స్థాయిలో అభివృద్ధి కనిపించిన తర్వాత.. చూపించిన తర్వాతే రెండో విడత భూసమీకరణ సక్సెస్ అవుతుంది. ఈ లోపే మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకు వారికి చెప్పిన హామీలు నెరవేర్చి.. ఇవ్వాల్సిన భూముల్ని అభివృద్ధి చేసి ఇస్తే ఇక తిరుగు ఉండదు. ఇదే అభిప్రాయం ప్రజల్లోనూ కనిపించడంతో.. ప్రభుత్వం రెండో […]

Card image cap

ప‌వ‌న్ ఫ్యాన్స్ ని స‌ర్‌ప్రైజ్ చేసిన కీర‌వాణి

హైద‌రాబాద్ లోని శిల్ప‌క‌ళావేదిక‌లో ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ వేడుక‌లా జరిగింది. ఈ ఈవెంట్ ప్ర‌మోష‌న్ల‌కు బాగా బూస్ట‌ప్ ఇచ్చింది. ఈ రెండు రోజులు కూడా వీర‌మ‌ల్లు ప్ర‌మోష‌న్లు ఈ రేంజ్‌లోనే సాగే అవకాశం ఉంది. ఈ ఈవెంట్ లో ప‌వ‌న్ స్పీచ్ హైలెట్ అయితే… కీర‌వాణి ఇచ్చిన స‌ర్‌ప్రైజ్ మ‌రో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఈ చిత్రానికి కీర‌వాణి సంగీతం అందించిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాకు కీర‌వాణి ప‌ని చేయ‌డం ఇదే […]

Card image cap

తెలంగాణ రాజకీయాల్లో రెబల్ స్టార్స్ హవా !

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బలమైన తిరుగుబాటుదారులే కీలక పాత్ర పోషిస్తున్నారు. వారు అలా పార్టీ నుంచి బయటకు పోరు.. పార్టీకి విధేయంగా ఉండరు. పక్కలో బల్లెంలా నాయకత్వానికి చికాకు పెడుతూనే ఉన్నారు. ఇది ఒక్క పార్టీకి ప్రధానంగా ఉన్న మూడు పార్టీలకు ఉన్న సమస్య. బీఆర్ఎస్ పార్టీకి కవిత పెద్ద సమస్యగా మారారు. ఆమెపై చర్యలు తీసుకోరు. ఆమె బయటకు వెళ్లరు. తన పార్టీ బీఆర్ఎస్ అంటారు. కానీ బీఆర్ఎస్ విధానాలకు విరుద్ధంగా రాజకీయాలు చేస్తూ ఉంటారు. […]

Card image cap

ఈడీ ఎందుకీ హడావుడి ? అసలు కేసులు వదిలేసి!

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విషయంలో ఈడీ అత్యుత్సాహన్ని సుప్రీంకోర్టు గట్టిగానే ప్రశ్నించింది. ఈడీ రాజకీయ ఆయుధంగా మారిన వ్యవహారంపై లోలోపల ఉన్న అసంతృప్తి అంతా బయటకు వచ్చింది. సిద్ధరామయ్య కానీ..ఆయన భార్య కానీ ఒక్క రూపాయి మనీ లాండరింగ్ చేయలేదు. వారు ఇచ్చిన భూమికి ప్రతిఫలంగా ఖరీదైన భూములు కేటాయించారని లోకాయుక్త కేసు. ఆ కేసును మనీ లాండరింగ్ వ్యవహారాలు చూడాల్సిన ఈడీ కూడా తీసుకుంది. కానీ న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బ తిన్నది. ఇది రాజకీయ పూరిత […]

Card image cap

మిథున్ రెడ్డిని పార్క్ హయత్‌లో పెట్టడం బెటర్ !

లిక్కర్ స్కాంలో ప్రజల రక్తమాంసాలను పీల్చి కోట్లు దండుకున్న మిథున్ రెడ్డి అనే ఎంపీని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపింతే.. ఆయన తనకు కావాల్సిన సౌకర్యాల జాబితాను కోర్టుకు సమర్పించారు. కోర్టు ఆ సౌకర్యాలను కల్పించే విషయంలో అభ్యంతరాలు నేరుగా కోర్టుకు వచ్చి చెప్పాలని.. జైలు అధికారులకు నోటీసులు ఇచ్చింది. జైలు సిబ్బందికి ఏమైనా అభ్యంతరాలు ఉంటాయో లేవో కానీ.. ఆయన అడిగిన వసతులు చూస్తే మాత్రం.. ఆయనను రాజమండ్రి జైలులో ఉంచడం కన్నా.. తీసుకెళ్లి.. […]

Card image cap

ఉపరాష్ట్రపతి రాజీనామా – మోదీ ప్లాన్ ఏంటో ?

ఉపరాష్ట్రపతి జగదీప్ థన్‌ఖడ్ రాజీనామా వ్యవహారం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అసలు రాజీనామా అనే ఆలోచన ఉందని బయట ప్రపంచానికి తెలియదు. అప్పటి వరకూ సభను నిర్వహించి ఆ తర్వాత వెంటనే రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాలు అని చెప్పినప్పటికీ ఏదో జరిగిందని చాలా మందికి అర్థమవుతోంది. అదేమిటన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఏరి కోరి ఉపరాష్ట్రపతిగా అవకాశం ఇచ్చిన మోదీ నాలుగేళ్ల క్రితం వెంకయ్యనాయుడు పదవి కాలం ముగిసిన తర్వాత ఎవరు ఉపరాష్ట్రపతి అనే […]

Card image cap

జగన్ బాధ వినే జాతీయ పార్టీలేవి ?

“ లిక్కర్ స్కామ్ చాలా పెద్దది. జగన్, భారతిలే సూత్రధారులు” అని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఇంగ్లిష్‌లో సమగ్రంగా ట్వీట్ పెట్టారు. దీనికి కారణం … జగన్మోహన్ రెడ్డి ఏపీలో మిథున్ రెడ్డిది అక్రమ అరెస్టు అని ఇంగ్లిష్‌లో ట్వీట్ పెట్టడమే . మాణిగం ఠాగూర్ ట్వీట్ పై సజ్జల స్పందించారు. అది కాంగ్రెస్ ట్వీట్ కాదని.. ఎవరైనా ఆ ట్వీట్ ను రాహుల్ కు చూపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కాంగ్రెస్ విధానాల ప్రకారమే […]

Card image cap

షాక్: ఉపరాష్ట్రపతి రాజీనామా!

ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా, వైద్య సలహా మేరకు తాను పదవుల్ని వదిలేస్తున్నానని ఆయన లేఖ రాశారు. ఆయన రాజీనామా లేఖ బయటకు వచ్చే వరకూ అలాంటి ఆలోచన ఉందని కూడా ఎవరికీ తెలియదు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు సోమవారం.. రాజ్యసభను నిర్వహించారు కూడా. అయితే విపక్షాల ఆందోళనలతో సభ సజావుగా సాగలేదు. దూకుడైన ప్రకటనలకు పెట్టింది పేరైన ధన్‌ఖడ్ రాజీనామా ఊహించనిదే. రాజకీయ […]

Card image cap

బీజేపీ వైపు మల్లారెడ్డి ఫ్యామిలీ ?

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీ వైపు చూస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ రాజకీయాల్లో పెద్దగా కనిపించని మల్లారెడ్డి కుటుంబం ఇప్పుడు బండి సంజయ్ తో పరిచయాలు పెంచుకుంటోంది. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఇటీవల చురుకుగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆమెకు చాలా రాజకీయ ఆసక్తి ఉంది. వచ్చే ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి తానే పోటీ చేస్తానని ఓ సందర్భంలో ఆమె అన్నట్లుగా ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో ప్రీతిరెడ్డి బండి సంజయ్ ద్వారా బీజేపీలో […]

Card image cap

EDకి సుప్రీంకోర్టు హెచ్చరిక – రాజకీయ కేసుల్లో జోరు తగ్గుతుందా ?

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు భూముల్లో అనుచిత లబ్ది జరిగిందంటూ ఈడీ అధికారులు పెట్టిన కేసుల వ్యవహారంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజకీయ యుద్ధాలు ఓటర్ల ముందు జరగాలి కానీ ఈడీ ఇందులో ఎందుకు భాగమవుతోందని ప్రశ్నించింది. ఈడీ తరపున వాదిస్తున్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజుకు ఘాటు హెచ్చరికలు పంపింది. మమ్మల్ని ఏమీ మాట్లాడేలా బలవంతం చేయవద్దు… లేకపోతే మేము ఈడీ గురించి కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేయవలసి ఉంటుందని […]

Card image cap

ఫిష్ వెంక‌ట్‌.. న‌టులు నేర్వాల్సిన మ‌రో పాఠం

ఇండస్ట్రీలో టాలెంట్ ఒక్క‌టే స‌రిపోదు. క్ర‌మ‌శిక్ష‌ణ కూడా చాలా అవ‌స‌రం. అది లేకే చాలామంది త‌మ కెరీర్ నాశ‌నం చేసుకొన్నారు. ఫిష్ వెంక‌ట్ కూడా అలాంటి న‌టుడే. ఫిష్ వెంక‌ట్ గొప్ప న‌టుడేం కాక‌పోవొచ్చు. కానీ అదృష్టం కొద్దీ మంచి అవ‌కాశాలే వ‌చ్చాయి. త‌న‌దైన టైమింగ్, టిపిక‌ల్ డైలాగ్‌ డెలివ‌రీతో అవ‌కాశాల్ని అందిపుచ్చుకొన్న న‌టుడు ఫిష్ వెంక‌ట్‌. త‌న ఎక్స్‌ప్రెష‌న్ ఎప్పుడూ ఒకేలా ఉండేది. కానీ అదే పే ఆఫ్ అయ్యేది. విల‌న్ గ్యాంగ్ లో కొన్ని […]

Card image cap

మిథున్ రెడ్డి అరెస్ట్ – ఏం చేయాలో అర్థం కాని జగన్ !

మిథున్ రెడ్డి అరెస్ట్ అనంతరంలో వైసీపీలో నిశ్మబ్దం ఆవరించింది. ఏం చేయాలో.. ఎలా చేయాలో.. ఎందుకు చేయాలో అర్థం కావడం లేదు. మిథున్ రెడ్డి అరెస్టుపై జగన్ బెంగళూరు లో ఉండి ఓ ట్వీట్ పడేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి పిల్లి శాపాలు పెట్టారు. రాజమండ్రిలో జైలు వద్దకు జన సమీకరణ చేయాలని.. జక్కంపూడిలాంటి వారికి ఆదేశాలు ఇస్తే కొంత మందిని పోగేశారు. అంతా అయిపోయాక..ఇప్పుడు ఏం చేయాలో వైసీపీలో ఎవరికీ ఏమీ అర్థం కావడం లేదు. మహా […]

Card image cap

హైదరాబాద్‌కు ఔటర్ రింగ్ రైలు – అలైన్‌మెంట్ రెడీ !

ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ అభివృద్ధిలో గేమ్ ఛేంజర్. చాలా కొద్ది కాలంలోనే ఔటర్ వరకూ నగంరం కిక్కిసిపోయింది. అందుకే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ను ప్లాన్ చేశారు. ఇప్పుడు కొత్తగా దేశంలోనే వినూత్నంగా ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారు. ప్రాంతీయ రింగ్ రైల్వే ప్రాజెక్టు తుది అలైన్‌మెంట్‌కు ఆమోదం లభించింది. మొత్తం 8 జిల్లాలను అనుసంధానించే 392-కి.మీ రైలు కారిడార్ ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే మొట్టమొదటి రింగ్ రైల్వే అలైన్‌మెంట్‌ను […]

Card image cap

ప‌వ‌న్ సింప్లిసిటీ: ఇలా ఎవ‌రైనా మాట్లాడ‌గ‌ల‌రా?

సినిమా ప‌రిశ్ర‌మ చుట్టూ ‘ఈగో’ వైఫై లా తిరుగుతుంటుంది. ఫాల్స్ ప్రెజ్టేజీ ఎక్కువ‌. ‘నేనే తోపు’ అనుకొనేవాళ్లు అడుగ‌డుగునా క‌నిపిస్తారు. కొంత స్టార్డ‌మ్ వ‌స్తే ‘న‌న్ను మించినోడు లేడు’ అనే అనుకొంటారు. వాళ్లంద‌రి మ‌ధ్య‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టైల్ వేరు, ఆయ‌న స్థాయి వేరు. ‘ప‌వ‌ర్ స్టార్’ అని అని పిలిపించుకోవ‌డం కూడా ఆయ‌న‌కు ఇష్టం ఉండ‌దు. `న‌న్ను అలా పిల‌వ‌కండి` అని చాలాసార్లు అభిమానుల్ని వేడుకొన్నారు. పొలిటిక‌ల్ స్పీచులు దంచికొట్టే ప‌వ‌న్‌.. సినిమా ప్రెస్ మీట్‌లో […]

Card image cap

ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్‌ ఎ.ఎం.ర‌త్నం: ప‌వ‌న్ అనుకొంటే అయిపోయిన‌ట్టే

నిర్మాత ఏఎం ర‌త్నం ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్‌గా నియ‌మితుల‌య్యే అవ‌కాశం ఉంది. ర‌త్నం పేరుని ఈ ప‌ద‌వి కోసం ప్ర‌తిపాదించిన‌ట్టు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్ లో జ‌రిగిన ‘వీర‌మ‌ల్లు’ ప్రెస్ మీట్ లో ప‌వ‌న్ ఈ విష‌య‌మై మీడియాకు లీక్ తానే అందించారు. ప్ర‌స్తుతం ఈ ఫైల్ ముఖ్య‌మంత్రి టేబుల్ పై ఉంది. ఆయ‌న సంత‌కం పెడితే… ఏఎం ర‌త్నానికి ప‌ద‌వి ద‌క్కిన‌ట్టే. ర‌త్నం అంటే ప‌వ‌న్‌కు ప్ర‌త్యేక‌మైన అభిమానం. […]

Card image cap

పేర్ని నాని మళ్లీ కనిపించుట లేదు !

బయట కనిపిస్తే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం, గొడవలు రేగేలా రెచ్చగొట్టడం కేసులు నమోదైతే కనిపించకుండా పోవడం..కోర్టులో రిలీఫ్ దొరికిన తర్వాతే మళ్లీ బందరులో ప్రత్యక్షం కావడం అనే టైంటేబుల్ ను పేర్ని నాని కంటిన్యూ చేస్తున్నారు. ఇటీవల వరుసగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. చంద్రబాబు ప్రాణానికి కూడా హాని తలపెడతామన్నట్లుగా వ్యాఖ్యానించడంతో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో పేర్ని నాని తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టుకు వెళ్లారు. కానీ ఊరట దక్కలేదు. మళ్లీ […]

Card image cap

వివేకా కేసులో సీబీఐ అభిప్రాయం అడిగిన సుప్రీం !

వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం ఉందా లేదా అన్న అంశంపై అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. సునీతతో పాటు సీబీఐ దాఖలు చేసిన అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా మూడు అంశాలపై సీబీఐ అభిప్రాయాలను సుప్రీంకోర్టు అడిగింది. దర్యాప్తు ఇంకా అవసరమని సీబీఐ భావిస్తోందా..?, కడప సెషన్స్ కోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ పై ఏమనుకుంటున్నారు?, కేసు ట్రయల్, […]

Card image cap

పెట్టుబడికి అయితే ద్వితీయ శ్రేణి నగరాల్లో స్థలాలు, ఇళ్లే బెటర్ !

స్థిరాస్తులు కొనుగోలు చేసేవారు రెండు రకాలుగా ఉంటారు. ఒకరు సొంతంగా ఇళ్లల్లో నివసించేందుకు..మరొకరు భవిష్యత్ లో పెట్టుబడులుగా పెట్టేందుకు స్థిరాస్తులు కొంటూ ఉంటారు. నివాసం ఉండాలనుకుంటే ఉద్యోగం, వ్యాపారం ఉన్న చోటకొనుగోలు చేయక తప్పదు. కానీ పెట్టుబడి కోసం అయితే ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చు.. మంచి రిటర్న్స్, విలువలు పెరిగే చోట కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో మెట్రో నగరాల్లో ఇళ్ల స్థలాల ధరలు బాగా పెరిగిపోయాయి. అపార్టుమెంట్ల ధరలు కూడా వచ్చే ఐదు సంవత్సరాల […]

Card image cap

భాస్క‌ర‌భ‌ట్ల‌కు సిల్వ‌ర్ జూబ్లీ: ఆ పాట‌కు పాతికేళ్లు

భాస్క‌ర‌భ‌ట్ల ర‌వికుమార్ మంచి క‌వి. అయితే క‌వి అయిన ప్ర‌తి ఒక్క‌రూ గీత ర‌చ‌యిత కాలేరు. అయినా భాస్క‌ర‌భ‌ట్లంత పాపుల‌ర్ కాలేరు. పాట‌కున్న మీట‌ర్ వేరు. అది భాస్క‌ర‌భ‌ట్ల‌కు బాగా తెలుసు. కొంత‌మంది గీత ర‌చ‌యిత‌లు గొప్ప పాండిత్యం ప్ర‌ద‌ర్శిస్తారు. త‌మ‌కున్న భాషా ప‌రిజ్ఞాన‌మంతా పాట‌ల్లో గుమ్మ‌రిస్తారు. ‘ఈ ప‌దం సామాన్యుల‌కు అర్థం అవుతుందా, లేదా’ అనేది ఆలోచించ‌రు. అదే అడితే.. ‘అర్థం కాక‌పోతే అర్థాలు తెలుసుకొని మ‌రీ ఆస్వాదిస్తారు’ అంటారు. ఆ మాటా క‌రెక్టే. సిరివెన్నెల […]

Card image cap

వడ్డీ రేట్లు తగ్గించినా రియల్ మార్కెట్ డౌన్ – ఎందుకిలా?

దేశంలో ఇళ్ల అమ్మకాలు తగ్గిపోతున్నాయి. ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు రోజు రోజుకు క్షీణించిపోతున్నాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడంతో డిమాండ్ పెరుగుతుందని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని.. తగ్గుతున్న ఇళ్ల అమ్మకాలే నిరూపిస్తున్నాయి. దేశంలోని టాప్-8 నగరాలు హైదరాబాద్, ముంబై, పుణె, బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్ లలో ఇళ్ల అమ్మకాలు 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోలిస్తే 14 శాతం తగ్గాయి. హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. రియల్ ఎస్టేట్ […]

Card image cap

బీజేపీ కొత్త అధ్యక్షుడి తొలి సవాల్ ఈటల, బండి పంచాయతీనే !

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న రామచంద్రరావుకు మొదటి సవాల్ సొంత పార్టీ నుంచే ఎదురవుతోంది. ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చాల్సిన అవసరం కనిపిస్తోంది. వీరి మధ్య హుజూరాబాదే పెద్ద సమస్యగా మారుతోంది. ఈటల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీగా ఉన్నారు. కానీ సుదీర్ఘంగా ప్రాతినిధ్యం వహించిన హుజూరాబాద్ ను వదులుకోవాలని అనుకోవడం లేదు. కానీ కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్.. హుజూరాబాద్‌లో బీజేపీ కార్యకర్తలను బలపరుస్తున్నారు. ఈటల రాజేందర్ వర్గంగా […]