Telugu 360 Telugu

Card image cap

ఇక నుంచి కవిత తెలంగాణ జాగృతి లీడర్ !

కల్వకుంట్ల కవిత మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. అదానీ విషయంలో మోదీపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసిన ఆమె ఒక్క రోజులోనే యాక్టివ్ అయిపోయారు. జాగృతి పేరుతో గతంలో తన వెంట నడిచి చెల్లా చెదురు అయిపోయిన నేతల్ని మళ్లీ పిలిపించుకుని తన ఇంట్లో సమావేశం నిర్వహించారు. తెలంగాణ జాగృతి తరపున బీసీ కమిషన్ కు త్వరలోనే నివేదిక సమర్పిస్తామని ప్రకటించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునేందుకు అంటూ పెట్టిన జాగృతిని లిక్కర్ స్కామ్‌లో అరెస్టు చేసే […]

Card image cap

జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిజం లేదని సుప్రీంకోర్టు చెప్పింది: పేర్ని నాని

వైసీపీ నేతలకు చాన్స్ ఇస్తే సుప్రీంకోర్టు తీర్పులు కూడా రాసేకుంటారు. ఈ విషయం మరో సారి రుజువు అయింది. అదానీ నుంచి లంచాలు తీసుకుని అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా బుకాయించేందుకు పెద్ద నోరున్న పెద్ద పాలేరుగా చెప్పుకున్న పేర్ని నాని బరిలోకి దించారు. ఆయన జగన్ పై పెట్టిన కేసుల్లో నిజం లేదని సుప్రీంకోర్టు తేల్చేసిందని ప్రకటించారు. ఇదెప్పుడు జరిగిందబ్బా అని అందరూ ఆశ్చర్యపోయారు. సంతకాలు పెట్టిన అధికారుల తప్పు లేదని తేల్చిందని అలాంటప్పుడు ఇక […]

Card image cap

జగన్ డీల్‌పై ఏపీ ప్రభుత్వం విచారణ!

ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని జగన్ రెడ్డి చేసిన అవినీతి విషయంలో ప్రజలకు భారం పడకుండా.. పెట్టుబడుల విషయంలో రాష్ట్రానికి నష్టం జరగకుండా చూసేందుకు చంద్రబాబు బ్యాలెన్స్‌డ్‌గా స్పందిస్తున్నారు. అదానీ – జగన్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా విచారణ చేయిస్తామని ప్రతి విషయాన్ని ప్రజల ముందు ఉంచుతామని చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. విద్యుత్ ఒప్పపందాలు ప్రజలకు భారం అయితే రద్దు చేయడానికి కూడా వెనుకాడబోమన్నారు. పెట్టుబడులదారుల్లో ఇప్పుడిప్పుడే విశ్వాసం పెంచుతున్నామని.. దాన్ని కాపాడుకోవాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ […]

Card image cap

దేవకీ నందన వాసుదేవ రివ్యూ: హత విధీ…

devaki nandana vasudeva movie telugu review తెలుగు360 రేటింగ్‌: 1.5/5 హనుమాన్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మపై అంచనాలు ఇంకా పెరిగాయి. ఆయన కథ ఇస్తున్నారంటే అదొక అసెట్ గా మారింది. అశోక్ గల్లా హీరోగా నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ కూడా ప్రశాంత్ వర్మకథతోనే ద్రుష్టిని ఆకర్షించింది. గుణ 369 సినిమా తీసిన అర్జున్ జంధ్యాల దీనికి దర్శకుడు. ఈయన బోయపాటి శిష్యుడు. ప్రాశాంత్‌ వర్మ కథతో బోయపాటి సినిమా తీస్తే ఎలా వుంటుందో […]

Card image cap

ఆసీస్‌తో టెస్ట్: తొలిరోజే 17 వికెట్లు

ఆస్ట్రేలియా పిచ్‌లు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. స్వింగ్‌కు స్వ‌ర్గ‌ధామం. పేస‌ర్లు ఇలాంటి పిచ్‌ల‌పై పండ‌గ చేసుకొంటారు. చ‌లికాలంలో కూడా బ్యాట‌ర్ల‌కు సెగ‌లు పుట్టిస్తారు. అచ్చంగా అదే జరుగుతోంది. బోర్డ‌ర్ – గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ లో మొద‌లైన తొలి టెస్ట్ ఆస‌క్తిక‌రంగా ప్రారంభ‌మైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు కేవ‌లం 150 ప‌రుగులకే కుప్ప‌కూలిపోయింది. అనంత‌రం ఆసీస్ 7 వికెట్ల న‌ష్టానికి 67 ప‌రుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంకా […]

Card image cap

పెద్దిరెడ్డికి ఇంతకు మించిన అవమానం ఏముంటుంది ?

సీనియర్ నేత పెద్దిరెడ్డిని జగన్ రెడ్డి హ్యూమలేట్ చేశారు. ఆయన స్థాయికి అతి చిన్న పదవి అయిన పీఏసీ సభ్యుడి పదవికి పోటీ చేయమని చెప్పి ఆయన పత్తా లేకుండా పోయారు. కనీసం ఓటింగ్ కు కూడా రాలేదు. ఆయన రాలేదని మిగతా ఎమ్మెల్యేలు కూడా రాలేదు. పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే పదో వంతు సభ్యుల మద్దతు ఉండాలి. అంత బలం వైసీపీకి లేకనే జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. పీఏసీ […]

Card image cap

బాలకృష్ణ కాదు ఆ పని చేయించింది జగనే : షర్మిల

ఓ టాలీవుడ్ హీరోతో తనకు సంబంధం ఉందని బాలకృష్ణ ప్రచారం చేయించాడని షర్మిల ఆరోపించిందని జగన్ మూడు రోజుల కిందట ప్రెస్మీట్‌లో ఆరోపించారు. ఓ వీడియో క్లిప్ కూడా ప్రదర్శించారు. ఇప్పుడు షర్మిల లైవ్‌లో అసలు ఆ పని చేయించింది జగన్ రెడ్డేనని ప్రకటించార. హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించిన షర్మిల.. తన సైతాన్ సైన్యంతో జగనే తనకు ఓ హీరోతో సంబంధం ఉందని ప్రచారం చేయించారన్నారు. తనకు ఎలాంటి రిలేషన్ లేదని తన పిల్లలపై అప్పుడూ […]

Card image cap

ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌దే నిర్ణయం : తెలంగాణ హైకోర్టు

ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని ఉపఎన్నికలు వస్తాయని బెదిరిస్తూ వస్తున్న కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేల అనర్హతా పిటిషన్ల విషయంలో స్పీకర్‌దే తుది నిర్ణయం అని హైకోర్టు స్పష్టం చేసింది. స్పీకర్ ఎలాంటి గడువు విధించలేమని తెలిపింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ ముందు ఎమ్మెల్యేలు సవాల్ చేశారు. స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్.. స్పీకర్ కు ఏలాంటి టైం బాండ్ లేదని వాదన […]

Card image cap

జీబ్రా రివ్యూ: దొంగాట‌లో గంద‌ర‌గోళం

Zebra Movie review తెలుగు360 రేటింగ్‌: 1.75/5 టాలెంట్ వున్నా అదృష్టం కలిసి రాని నటుడు సత్యదేవ్. హీరోగా తనకు ఈపాటికే బ్రేక్ రావాల్సింది. కానీ సరైన సినిమాలు పడలేదు. ఒక దశలో సినిమాలు కూడా తగ్గాయి. అయితే చిరంజీవి గాడ్ ఫాదర్ లో చేసిన విలన్ క్యారెక్టర్ సత్యకు మళ్ళీ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ సినిమానే’ జీబ్రా’ అవకాశం తెచ్చింది. దీనికి పుష్పలో జాలి రెడ్డి పాత్రతో పాపులర్ అయిన డాలీ ధనంజయ తోడయ్యాడు. […]

Card image cap

ఉప్పల్ భగాయత్‌లో ఇల్లు కొనుగోలు మంచి పెట్టుబడేనా ?

హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌ జంట నగరాల్లో హాట్ ప్రాపర్టీల్లో ఒ!కటిగా మారింది. ఉప్పల్‌ మెట్రో డిపో, నాగోల్‌ మెట్రోస్టేషన్‌ ఇరువైపులా సుమారు 430కి పైగా ఎకరాల్లో మూసీ వెంబడి హెచ్‌ఎండీఏ ఈ భారీ లేఅవుట్‌ను అభివృద్ధి చేసింది. ఇందులో అత్యంత విశాలమైన 150, 120, 80, 60 ఫీట్ల వెడల్పుతో కూడిన రోడ్లను, మూసీ వెంబడి తీరం ప్రాంతంలో 3 కి.మీ పొడవైన పార్కును నిర్మించారు. వేలంలో మంచి ధరకు హెచ్‌ఎండీఏ అమ్మింది. […]

Card image cap

ఆఫర్లు, డిస్కౌంట్లు – ఇల్లు కొనుగోలుకు ఇదే బెస్ట్ టైమ్

దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న అనిశ్చితి కారణంగా ఆయా రంగాల్లోని వ్యాపార సంస్థలు మనీ రొటేషన్ కోసం అయినా అమ్మకాలు తగ్గకుండా చూసుకుంటున్నాయి. ఈ క్రమంలో చాలా కంపెనీలు ఆఫర్లు ఇస్తున్నాయి. డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మెరుగుపడుతోంది. ఎంక్వయిరీలు పెరుగుతున్నాయి. వాటిని చివరి కొనుగోలు వరకూ తీసుకెళ్లేలా కొత్త కొత్త ఆఫర్లను హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఇస్తున్నాయి. […]

Card image cap

రాజ్యసభలో వైసీపీ ఎంపీలకు ఇక ఒకటే పని !

రాజ్యసభలో మిగిలిన వైసీపీ ఎంపీలు.. లోక్‌సభలో ఉన్న ముగ్గురు ఎంపీలకు ఇక ఒకటే పని. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా గళమెత్తాలని పోలవరం,ప్రత్యేకహోదా అంటూ సాక్షి పత్రికలో లిస్టు రాసినా అసలు వారికి ఇచ్చిన టాస్క్ ఒక్కటేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అదేమిటంటే బీజేపీని కాకాపట్టడం. రాజ్యసభలో, లోక్ సభలో ఎవరికి మాట్లాడే అవకాశం వచ్చినా ముందుగా మోదీని పొగడ్తలతో ముంచెత్తాలని ఆ తర్వాత సబ్జెక్ట్ మీదకు వెళ్లారని జగన్ దిశానిర్దేశం చేసినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రెండు […]

Card image cap

ఏడో తేదీలోపే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ?

తెలంగాణ మంత్రి వర్గాన్ని డిసెంబర్ ఏడో తేదీలోపే విస్తరించే అవకాశం ఉంది. ఆ రోజుకి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుంది. ఆరు మంత్రి పదవుల్ని ఖాళీగా ఏడాది ఉన్నట్లు అవుతుంది. ఎంతో మంది ఆశావహులు ఉన్నా పార్టీ కోసం పదేళ్ల పాటు పని చేసినా అవకాశం రాని వారు నిరాశలో ఉన్నారు. అలాగే కొన్ని ఉమ్మడి జిల్లాలకు.. మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. మొత్తంగా పన్నెండు మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. ఈ విషయం పాలనపై ప్రభావం చూపుతోంది. […]

Card image cap

ఓటు లేనట్లే – హడావుడిగా బెంగళూరుకు జగన్!

జగన్ మోహన్ రెడ్డి హడావుడిగా బెంగళూరుకు పయనమవుతున్నారు. ఉదయం వరకూ షెడ్యూల్ లో లేని బెంగళూరు పర్యటన ఉదయమే ఖరారు చేసుకున్నారు. ప్రత్యేక విమానం రెడీ చేసుకుని పదిన్నరకు బెంగళూరుకు బయలుదేరుతున్నారు. నిజానికి ఆయన షెడ్యూల్ లో అసెంబ్లీకి వెళ్లి ఓటు వేయాల్సిన అవసరం పడేలా ఉంటుందని అంచనాకు వచ్చారు. అందుకే ఆయన తాడేపల్లిలోనే ఉండాలనుకున్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎన్నికల్లో బలం లేకపోయినా పెద్దిరెడ్డిని అభ్యర్థిగా నిలిపారు. ఆయనకు ఓటేయకుండా బెంగళూరు వెళ్లిపోవడానికి కారణం అదానీ […]

Card image cap

అదానీపై ఆరోపణలు – ఇన్వెస్టర్లకు శాపం !

అదానీపై ఆరోపణలు వచ్చినప్పుడల్లా ఆయన కంపెనీలకు చెందిన స్టాక్స్ పేకమేడల్లా కుప్పకూలిపోతున్నాయి. గౌతం అదానీపై అమెరికాలో కేసు నమోదయిందని.. అరెస్టు వారెంట్ జారీ అయిందని తెలియగానే ఇరవై శాతం షేర్ వాల్యూ తగ్గిపోయింది. ఇది మొత్తం రెండు లక్షల ఇరవై వేల కోట్లు. ఇందులో సామాన్య ఇన్వెస్టర్ల సంపదే. అదానీకి ఎంత తగ్గిపోయిందనే సంగతి పక్కన పెడితే ఆయన రూపాయికి.. సామాన్య ఇన్వెస్టర్ రూపాయికి విలువలో ఎంతో తేడా ఉంటుంది. అదానీకి కంపెనీల షేర్లు పేకమేడల్లా కుప్పకూలిపోవడం […]

Card image cap

‘మెకానిక్ రాకీ’ రివ్యూ: ట్విస్టుల‌తో టింక‌రింగు చేసిన క‌థ‌

Mechanic Rocky Movie Telugu Review తెలుగు360 రేటింగ్: 2.75/5 -అన్వర్- విశ్వ‌క్‌సేన్ మొద‌ట్నుంచి కాస్త భిన్న‌మైన క‌థ‌ల‌నే ఎంచుకొంటున్నాడు. మాస్ సినిమా చేసినా అందులో ఏదో నావెల్టీ ఉంటుంది. ఆ సినిమాలు స‌క్సెస్ అవుతున్నాయా, లేదా? అనేది త‌రువాతి సంగ‌తి. త‌న వంతు ప్ర‌య‌త్నం అయితే చేస్తున్నాడు. దానికి తోడు ఓ సినిమాని ఎలా ప్ర‌మోట్ చేసుకోవాలో కూడా త‌న‌కు తెలుసు. యార‌గెన్సీ అనుకోండి, ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ అనుకోండి – త‌న సినిమా, త‌న పేరు […]

Card image cap

అదానీ డీల్‌ బురదను బీజేపీకీ అంటిస్తున్న వైసీపీ !

అదానీ అమెరికా అవినీతి వ్యవహారంలో ప్రధాన పాత్ర జగన్ రెడ్డిదే కనిపిస్తూండటంతో తమను ఎక్కడ టార్గెట్ చేస్తారోనని వైసీపీతో పాటు జగన్ రెడ్డి కూడా కంగారు పడుతున్నారు. అసలు ఆరోపణలేంటి చెప్పకుండా.. ఏపీ ప్రభుత్వం అదానీతో ఒప్పందం చేసుకోలేదని.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెకీతో ఒప్పందం చేసుకున్నామని వాదించడం ప్రారంభించారు. అంటే ఇందులో బీజేపీకి, కేంద్రానికి వాటా ఉందని నేరుగా వాదించడానికి సిద్దమయ్యారన్నమాట. అసలు స్కామ్ ఎలా చేయాలో తెలిసిన వాళ్లంతా కలిసి చేసిన స్కామ్ ఇది. […]

Card image cap

వివేకా హత్య కేసు : సునీల్ యాదవ్ కూడా అప్రూవర్ ?

వైఎస్ వివేకా హత్య కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సుప్రీంకోర్టులో కేసు ఉంది. సీబీఐ కూడా దర్యాప్తు ఆపేసింది. కానీ మరో కోణంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ కేసులో ఏ 2గా ఉన్న సునీల్ యాదవ్ కూడా పశ్చాత్తాపం చెందుతున్నారు. ఈ విషయంలో వివేకం సినిమాలో చూపించినదంతా నిజమేనని ఆయన మీడియాకు ఇంటర్యూలు ఇస్తున్నారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన హత్య కేసులో వివేకం సినిమాలో […]

Card image cap

ఓటేయడానికి జగన్ అసెంబ్లీకి వెళ్తారా ?

వైసీపీ అధినేత జగన్ రెడ్డి చేసే గుడ్డి రాజకీయాలకు ఇది మరో ఉదాహరణ. బలం లేనప్పుడు అధికారపక్షం దయతలిస్తే తీసుకోవాలి లేకపోతే సైలెంటుగా ఉండాలి..కానీ పోటీ చేస్తామని గుడ్డిగా అడుగులు ముందుకు వేస్తే ఇలాంటి పరిస్థితులే ఏర్పడతాయి. ఇప్పుడు పీఏసీ సభ్యుల ఎన్నికకు ఓటింగ్ చేయడానికి ఆయన అసెంబ్లీకి వెళ్లాలి. వెళ్లకపోతే సొంత పార్టీ అభ్యర్థిని నిలబెట్టి ఓటింగ్ వెళ్లని అధ్యక్షుడుగా రికార్డుకెక్కుతాడు. వెళ్తే తాను చేసిన శపధాన్ని తానే తక్కువ చేసుకున్నట్లవుతుంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో […]

Card image cap

ఎడిటర్స్ కామెంట్: దొంగా.. దొంగ !

దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏమవుతుంది ?. జాగ్రత్తగా కాపలా కాస్తానని నమ్మిస్తాడు. ఎందుకంటే తాను కావాల్సినంత దొంగతనం చేసేశానని డబ్బుపై ఆశ లేదని చెబుతాడు. నమ్మకంగా తాళాలు తీసుకున్న తర్వాత ఏం చేస్తాడు..? తాళాలు ఇస్తే చాలు.. నేను నిజాయితీగా ఉంటానని అప్పటి వరకూ ఆ దొంగ బలంగా అనుకుని ఉండవచ్చు కానీ.. లోపల బోలెడంత సొత్తు ఉంది చేతిలో తాళాలు ఉన్నాయి.. మనసు లాగకుండా ఉంటుందా?. లాగుతుంది తాళాలు తీసి ఉన్నదంతా ఊడ్చుకుపోతాడు. ఎందుకంటే […]

Card image cap

బుజ్జితల్లి.. మాస్ మెలోడీ

మాస్ కి నచ్చే మెలోడీ సాంగులు చేయడంలో దేవిశ్రీ ప్రసాద్ దిట్ట. ఆయన మెలోడీని ఎత్తుకోవడంలో ఒక మాస్ టచ్ వుంటుంది. ‘తండేల్’ ఫస్ట్ సింగిల్ లో ఈ మాస్ మెలోడీ కనిపించింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా ఇది. చందూ మొండేటి దర్శకత్వం. ఈ రోజు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు ఇదొక లవ్ సాంగ్. దేవి కంపోజ్ చేసి ట్యూన్ అందరికీ కనెక్ట్ అయ్యేలా వుంది. ట్యూన్, వాయిద్యాలని హడావిడి […]

Card image cap

ఇక తిట్టను అంటే వదిలేస్తారా పోసాని !?

రేపోమాపో అరెస్టు చేసి కుమ్మేస్తారని భయపడుతున్న వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఇక రాజకీయాలు మాట్లాడనని ప్రకటించారు. హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టిన ఆయన ఇకపై నేను రాజకీయాలు మాట్లాడనని.. నా జీవితాంతం వరకు రాజకీయాల జోలికి పోనని చెప్పుకొచ్చారు. ఇన్నేళ్ల జీవితం నేను ఎవరికి తలవంచలేదని.. తాను మగవాడ్నని చెప్పుకొచ్చారు. ఆడవాళ్ళనే ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. నన్ను తిట్టరా.. అయినా తాను పట్టించుకోననన్నారు. అందరికీ కంటే ఎక్కువగా తనను చంద్రబాబు పొగిడారని.. శ్రావణ మాసం సినిమా రిబ్బన్ […]

Card image cap

‘మహేష్’ ట్యాగ్ పోవాలంటే !

ఇండస్ట్రీ నేపధ్యం వున్న కుటుంబాల నుంచి నటులుగా వస్తే లాంచింగ్ సులువుగా దొరుకుందేమో కానీ, తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం అంత సలువు కాదు. ఒక బ్రేక్ వచ్చేవరకూ ఫలనా వారి అబ్బాయి, ఫలానా వారి మనవడు, మేనల్లుడు ఇలాంటి పరిచయాలే వుంటాయి. ప్రస్తుతానికి అశోక్ గల్లా పరిచయం కూడా ఇలానే జరుగుతోంది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, జయదేవ్ గల్లా కుమారుడనే ఆయన్ని సంభోదిస్తున్నారు. అశోక్ చేసిన తొలి సినిమా […]

Card image cap

ముందుగా అరెస్టు చేయాల్సింది లంచం ఇచ్చిన వారినా? తీసుకున్నవారినా ?

సెకీ పేరుతో విద్యుత్ ఒప్పందాలను ఆదానీ సంస్థతో చేసుకుని పాతికేళ్ల పాటు ఏపీ ప్రజల్ని దోపిడీ చేసుకునే చాన్స్ ఇచ్చినందుకు రూ.1750 కోట్ల లంచాలను జగన్ రెడ్డి తీసుకున్నారని అమెరికా కోర్టు నిర్దారించింది. ఇతర రాష్ట్రాల్లోనూ అదానీ గ్రూపు లంచాలు ఇచ్చింది. మిగిలిన ఐదు రాష్ట్రాలకు కలిపి రూ.350 కోట్ల లంచాలు ఇస్తే ఒక్క జగన్ రెడ్డే రూ.1750 కోట్లు తీసుకున్నారంటే ఎంత బరి తెగింపో అర్థం చేసుకోవచ్చు. ఈ ఒప్పందాలు చూపించే అమెరికా నుంచి పెట్టుబడులు […]

Card image cap

‘గేమ్ ఛేంజ‌ర్’ హైప్ పెంచేసిన సూర్య‌

ఎస్‌.జె.సూర్య ప్ర‌తినాయ‌కుల్లో స్టార్ అయిపోయాడు. ‘మానాడు’, ‘స‌రిపోదా శ‌నివారం’ చిత్రాల్లో సూర్య పాత్ర‌ల‌కు మంచి అప్లాప్ వ‌చ్చింది. ఇప్పుడు ‘గేమ్ ఛేంజ‌ర్‌’లోనూ త‌నే విల‌న్‌. ఈ సినిమాలో విల‌న్ పాత్ర‌ని శంక‌ర్ ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దార‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. సూర్య కూడా ‘గేమ్ ఛేంజ‌ర్‌’కు సంబంధించిన విష‌యాలు అప్పుడ‌ప్పుడు లీక్ చేస్తూ హైప్ పెంచేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా ఎస్‌.జె.సూర్య చేసిన ఓ ట్వీట్.. రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ కు పూన‌కాలు తెచ్చేలా వుంది. ”ఇప్పుడే రెండు […]

Card image cap

కవిత సైలెన్స్ బ్రేక్ – మోదీపై పైర్

అఖండ భారతంలో అదానికో న్యాయం…ఆడబిడ్డకో న్యాయమా ? అని ప్రధాని మోదీని కవిత ప్రశ్నించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలి సారి రాజకీయపరమైన ట్‌వీట్చేశారు. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా అని మండిపడ్డారు. తర్వాత ఇంగ్లిష్‌లో మరో ట్వీట్ పెట్టారు. అఖండ భారత్ సాధిస్తామని […]

Card image cap

రూ.7 కోట్ల‌కు త‌గ్గ‌నంటున్న మెగా హీరో!

మెగా హీరోల్లో వ‌రుణ్ తేజ్ ప‌రిస్థితి కొంచెం క్లిష్ట‌ప‌రిస్థితుల్లో ఉందిప్పుడు. కంటెంట్ బేస్డ్ సినిమాలు చేసే వ‌రుణ్‌.. మెల్ల‌గా క‌మ‌ర్షియ‌ల్ దారి ప‌ట్ట‌డం, ఆయా చిత్రాలు డిజాస్ట‌ర్లుగా నిల‌వ‌డం వ‌రుణ్ ని ఇబ్బందిక‌ర‌మైన స్థితిలోకి నెట్టేశాయి. ‘గ‌ని’, ‘ఆప‌రేష‌న్ వాలైంటేన్‌’, ‘గాంఢీవ‌ధారి అర్జున‌’, ‘మ‌ట్కా’… ఇలా వ‌రుస‌గా ఫ్లాపులు త‌గిలాయి. ఇలాంటి స్థితిలో ఏ హీరో అయినా పారితోషికం త‌గ్గించుకొని, నిర్మాత‌ల‌కు అందుబాటులో ఉండాల‌ని చూస్తారు. కానీ.. వ‌రుణ్ మాత్రం త‌న పారితోషికం ఏమాత్రం త‌గ్గించ‌లేద‌న్న‌ది ఇన్ […]

Card image cap

సాయి ప‌ల్ల‌వి ఫోన్ నెంబ‌ర్‌… కోటి రూపాయ‌ల ప‌రిహారం

శివ కార్తికేయ‌న్, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ‘అమ‌ర‌న్’ బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి ఫ‌లితాన్ని అందుకొంది. ఈ సినిమాతో నిర్మాత‌ల‌కు మంచి లాభాలొచ్చాయి. న‌ట‌న ప‌రంగా శివ కార్తికేయ‌న్‌, సాయి ప‌ల్ల‌విల‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అయితే ఈ ఇప్పుడు ఓ విద్యార్థి ఈ సినిమా నిర్మాత‌ల‌పై దావా వేశాడు. త‌న‌కు కోటిరూపాయ‌ల ప‌రిహారం చెల్లించాల‌ని డిమాండ్ చేశాడు. వివ‌రాల్లోకి వెళ్తే… ఈ సినిమాలోని ఓ సంద‌ర్భంలో హీరోయిన్ (సాయిప‌ల్ల‌వి) హీరోకు (శివ కార్తికేయ‌న్‌)కు త‌న ఫోన్ నెంబ‌ర్ […]

Card image cap

ఈ హీరోల‌కు ‘విష‌’మ ప‌రీక్ష‌

శుక్ర‌వారం అంటేనే సినీ అభిమానుల‌కు పండ‌గ‌. ఈ శుక్ర‌వారం కూడా జోరుగా సినిమాలొస్తున్నాయి. యువ హీరోలు విశ్వ‌క్‌సేన్ (మెకానిక్ రాఖీ), స‌త్య‌దేవ్ (జిబ్రా), అశోక్ గల్లా (దేవ‌కీ నంద‌న వాసుదేవ‌) చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నాయి. విడుద‌ల‌కు ముందు ఈ సినిమాల‌పై కాస్తో, కూస్తో బ‌జ్ క్రియేట్ అయ్యింది. దాన్ని ఈ సినిమాలు ఎంత వ‌ర‌కూ క్యాష్ చేసుకొంటాయ‌న్న‌ది ఆస‌క్తిక‌రం. దాంతో పాటుగా ఈ ముగ్గురు హీరోల‌కూ… ఈ చిత్ర ఫ‌లితాలు చాలా కీల‌కంగా మార‌నున్నాయి. యువ […]

Card image cap

అదానీ దగ్గర లంచాలు – అడ్డంగా దొరికిన జగన్ !

చెప్పింది భారత్‌లో పోలీసులు కాదు మ్యానేజ్ చేశారని ఆరోపించి తుడిచేసుకోవడానికి..అమెరికా కోర్టు. అక్కడ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన కంపెనీతో లావాదేవీ పెట్టుకోవడంతో జగన్ రెడ్డిని నిండా ముంచేసింది. ఇప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి అదానీ కేసులో లంచాలు తీసుకున్నట్లుగా అమెరికా దర్యాప్తు సంస్థలు తేల్చి స్పష్టంగా కోర్టులో కేసు పైల్ చేశాయి. ఇందులో చాలా స్ఫష్టంగా సెకీ ఒప్పందంలో 7,000 మెగా వాట్లకు గాను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మెగావాట్ కు […]

Card image cap

సారంగపాణి జాతకం టీజర్ : హస్త రేఖల హాస్యం

మంచి హ్యుమర్ టచ్ వున్న క్లాస్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి. తన ఇమేజ్ కి తగ్గ పాత్రలతో అలరించే నటుడు ప్రియదర్శి. ఎన్నో మరపురాని సినిమాలని అందించిన సంస్థ శ్రీదేవి మూవీస్. ఈ ముగ్గురు కలసి ‘సారంగపాణి జాతకం’ సినిమాతో రాబోతున్నారు. తాజాగా టీజర్ ని వదిలారు. ఇంద్రగంటి మార్క్ లో లైటర్ వెయిన్ ఎంటర్ టైనర్ అనిపించింది టీజర్. సారంగపాణి(ప్రియదర్శి)కి జాతకాల పిచ్చి. జీవితం మొత్తం హస్తరేఖల్లో రాసి ఉంటుందని నమ్మే మనిషి. పొద్దున్న పేపర్ […]

Card image cap

అదానిపై అమెరికాలో అవినీతి కేసు – ఏపీ లింకులే ?

అమెరికా న్యాయ శాఖ అదానీపై తమ దేశంలో కేసు పెట్టింది. నిందితులుగా గౌతమ్ అదానీ, సాగర్ అదానీలతో పాటు మరో ఆరుగురిని పేర్కొన్నారు . న్యూయార్క్ ఈస్ట్‌ర్న్ డిస్ట్రిక్ కోర్టులో అక్టోబర్ 24వ తేదీన కేసు నమోదుఅయింది. 2021-2024 మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో భారీ అవినీతి జరిగి ంపని తేల్చారు. ఇండియన్ ఎనర్జీ కార్పొరేషన్, దాని అనుబంధ కంపెనీల పాత్ర ఉందని సోలార్ ప్రాజెక్టులకు త్వరిత గతిన అనుమతి కోసం భారీ ఎత్తున లంచాలు ఇచ్చారని […]

Card image cap

గోదావరి జిల్లాల హాట్ ప్రాపర్టీ భీమవరం

గోదావరి జిల్లాలలో అతి పెద్ద నగరంగా విస్తరించే అవకాశాలు భీమవరంకు మెండుగా కనిపిస్తున్నాయి. రాజమండ్రి, కాకినాడలకు కొన్ని పరిమితులు ఉన్నాయి. కానీ భీమవరం విస్తరణకు మాత్రం చాలా అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అందుకే కొత్తగా భీమవరం మాస్టర్ ప్లాన్ రెడీ చేసి భారీగా అభివృద్ది చేయాలనికుంటున్నారు. ఇటీవలి కాలంలో భీమవరంలో నూతన కాలనీలు ఏర్పడ్డాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఎన్నో లే–అవుట్‌లు వేసి నిర్మాణాలు చేశారు. అవి పట్టణంలో విలీనం అయ్యాయి. పట్టణం అభివృద్ధి చెందినా […]

Card image cap

స్థలం కొంటే క్యాష్ బ్యాక్ – కొత్త తరహా మోసంతో 300 కోట్లు లూఠీ !

రియల్ఎస్టేట్ వ్యాపారం అంటే మోసం చేయడం అని గట్టిగా నమ్మేవారు చేస్తున్న మోసాలకు సామాన్యులు బలైపోతున్నారు. సొంత ఇల్లు లేదా స్థలం ఉండాలనుకుని ఆశపడే మధ్యతరగతి ప్రజల్ని రకరకాల స్కీములతో నిండా ముంచేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ వినూత్నమైన రియల్ ఎస్టేట్ మోసం వెలుగు చూసింది. ఈ మోసంలో ప్రజల నుంచి ఏకంగా రూ. 300 కోట్లు కొల్లగొట్టినట్లుగా తెలుస్తోంది. కొన్నాళ్ల కిందట కూకట్ పల్లి కేంద్రంగా 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ అనే కంపెనీని […]

Card image cap

చిన్న సైకోలే అరెస్టు – సూత్రధారులెప్పుడు ?

సోషల్ సైకోల వెనుక నిందితుడు ఏ ప్యాలెస్‌లో ఉన్నా సరే అరెస్టు చేయాలని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. ఆమె బాధితురాలు. ఇంకాచెప్పాలంటే అలాంటి బాధితులందరిదీ అదే మాట. ఆ బాధితుల్లో చంద్రబాబు ఉన్నారు..లోకేష్ ఉన్నారు..పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. పవన్ ఆగ్రహంతోనే చర్యలు ప్రారంభించారు. ఇప్పటి వరకూ సైకో మూక సంగతి చూశారు. ఇప్పుడు అసలు సూత్రధారుల సంగతి తేల్చాల్సి ఉంది. విజయమ్మతో పాటు షర్మిలపై పోస్టులు పెట్టడం వెనుక అవినాష్ రెడ్డి […]

Card image cap

జగన్ స్వార్థరాజకీయాలకు బలి పశువులు వాలంటీర్లు!

జగన్ రెడ్డి తప్పుడు రాజకీయాలకు లక్షల మంది వాలంటీర్ల జీవితం బుగ్గి అయిపోయింది. పదేళ్ల పాటు వారి జీవితాన్ని తీసుకున్న జగన్ తమ పార్టీ కోసం పని చేయించుకుని వారికి ఎలాంటి జాబ్ సెక్యూరిటీ లేకుండా చేశారు. ప్రజాధనం ఇస్తున్నందుకు కనీసం వారిని పద్దతిగా అయినా ఉపయోగించుకునే ప్రయత్నం చేయలేదు. వారినే లీడర్లుగా చేస్తామని ఆశ పెట్టి ఓటర్లను బెదిరించి పబ్బం గడుపుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో లక్షల మంది యువత జీవితాలను నాశనం చేస్తున్నామని తెలిసినా […]

Card image cap

ఈడీ గుప్పిట్లో లాటరీ కింగ్ – వైసీపీకి రూ.149 కోట్ల విరాళం!

లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ పై ఈడీ దాడులు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. చెన్నైలోని ఆయన కార్యాలయాల్లో కనీసం పాతిక కోట్ల వరకూ స్వాధీనం చేసుకున్నారు. ఈయన కంపెనీపై ఈడీ దాడులు సంచలనమే అనుకోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలతో వెలుగులోకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్ల జాబితాలో మేఘా కంపెనీ కంటే ఎక్కువగా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చింది శాంటియాగో మార్టిన్‌కు చెందిన కంపెనీస్. ఫ్యూచర్ గేమింగ్ పేరుతో ఈ కంపెనీ వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది., దేశవ్యాప్తంగా […]

Card image cap

ఇంకా ఢిల్లీనే రాజధానా ? వై నాట్ హైదరాబాద్ ?

ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా మారుతోంది. ఢాకా తర్వాత స్థానంలో ఢిల్లీనే ఉంది. అందుకే ఇంకా దేశ రాజధానిగా ఢిల్లీనే ఉంచుతారా అని కాంగ్రెస్ నేత శశిథరూర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆయన హైదరాబాద్‌ను రాజధానిగా ప్రకటించాలని అంటున్నారు. ప్రతీ ఏడాది కాలుష్యం అనేది పెద్ద సమస్య అయిపోయింది. నవంబర్ నుంచి జనవరి మధ్య ఈ నగరం నివాసయోగ్యం కాదని.. ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని దేశ రాజధానిగా కొనసాగించడం కరెక్ట్ కాదిని శశిథరూర్ వాదిస్తున్నారు. శశిథరూర్ […]

Card image cap

ముంతాజ్ హోటల్‌ ల్యాండ్ డీల్ – జగన్ బెదిరింపులు ?

అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ నిర్మాణానికి ఇరవై ఎకరాలు కేటాయించిన అంశంపై ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. స్వయంగా అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. గతంలో దేవలోకం అనే ప్రాజెక్టు చేపట్టిన వైష్ణవి అనే సంస్థకు ఇచ్చిన కేటాయింపుల్ని రద్దు చేసి వెనక్కి తీసుకునేందుకు జగన్ షూట్ చేస్తామని బెదిరించారని విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో ఆరోపించారు. ఈ అంశం […]

Card image cap

త్వరలో చంద్రబాబు స్టైల్ మన్ కీ బాత్ !

ప్రజలతో మమేకం అయ్యే విషయంలో చంద్రబాబు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు. మొదటి సారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన దూరదర్శన్‌లో ప్రజలతో ముఖ్యమంత్రి కార్యక్రమం నిర్వహించేవారు. అప్పట్లో ఇంటర్నెట్ లేదు.. స్మార్ట్ ఫోన్లు లేవు. శాటిలైట్ చానల్స్ లేవు. దూరదర్శన్ ఎక్కువ మందికి అందుబాటులో సమాచార సాధనం. అది బాగా వర్కవుట్ అయింది. తర్వాత వైఎస్ సీఎం అయ్యే నాటికి శాటిలైట్ చానల్స్ వచ్చాయి. వాటిలో ఆయన అలాంటి ప్రోగ్రాంలు చేశాం. ఆ తర్వాత సమాచార […]

Card image cap

సీఎం పదవిపై పవన్ వ్యాఖ్యలు – కూటమి ఐక్యతకు బలం !

పవన్ కల్యాణ్ కూటమి నుంచి విడిపోతే వచ్చే ఎన్నికల్లో తమకు అవకాశం ఉంటుందని ఆశపడుతున్న వైసీపీకి జనసేనానికి ఎప్పటికప్పుడు షాక్ ఇస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇటీవల చేస్తున్న హిందూత్వ రాజకీయం, మహారాష్ట్ర ప్రచారంలో కూడా పూర్తిగా ఆయన బీజేపీ భావజాలంతో చేసిన ప్రచారం వల్ల పవన్ దక్షిణాది మొత్తం విస్తరించడానికి ప్లాన్ చేసుకుంటున్నారని అంతా బీజేపీ మార్గనిర్దేశనంలో జరుగుతోందని కొంత మంది ప్రచారం ప్రారంభించారు. వచ్చే ఎన్నికల నాటికి కూటమి నుంచి విడిపోతారని ఆశలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి […]

Card image cap

బురద బుర్ర : చంద్రబాబు తల్లిదండ్రులేం చేశారు జగన్ !

జగన్ రెడ్డి బుర్ర ఎంత బురదలో ఉంటుందో బుధవారం ఆయన చేసిన వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయి. జగన్ రెడ్డి తన కుటుంబాన్ని రోడ్డున పడేసుకున్నారు. వారితోనే ఇష్టం వచ్చినట్లుగా తిట్లు తింటున్నారు. వారిని తన సోషల్ సైకోలతో తిట్టిస్తున్నారు. మనిషి అనే లక్షణాలు ఉన్న ఎవరైనా ఇలా చేయరండి బాబూ అని సామాన్యులు సైతం ఆశ్చర్యపోయేంతగా ఆయన ప్రవర్తన ఉంటుంది. ఇది నిజమేనని తాజాగా చంద్రబాబు తల్లిదండ్రుల ప్రస్తావన తీసుకు వచ్చి మరోసారి నిరూపించారన్న విమర్శలు వస్తున్నాయి. తల్లిదండ్రుల్ని […]

Card image cap

స్వాముల రాజకీయాలు – పీఠాలకు పార్టీల రంగులు!

స్వాములు సర్వసంగ పరిత్యాగులు. వారు ధనం నుంచి అధికారం వరకు దేనిపైనా ఆసక్తి చూపరు. అలా అయితేనే స్వాములంటారు. కానీ ఇప్పుడేం జరుగుతోంది. అధికారంలో ఉన్న వారిని.. రాజకీయ నేతలను మచ్చిక చేసుకోవడానికే పీఠాలు పెట్టేస్తున్నారు. అడ్డగోలుగా భూదందాలు చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఇలా తెరపైకి వస్తున్నారు. ఈ స్వాములు ధర్మ పరిరక్షణ చేయకుండా రాజకీయ నేతలతో ఎందుకు అంటకాగుతున్నారు. తెలంగాణలో కేసీఆర్‌తో అంటకాగిన చినజీయర్ స్వామి గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన తెలంగాణలో […]

Card image cap

జగన్‌కు కేబినెట్ ర్యాంక్ చాన్స్ – PAC చైర్మన్ అడగొచ్చుగా !

పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్ గా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేను చేయడం సంప్రదాయంగా వస్తోంది. గురువారం పీఏసీ చైర్మన్ ఎంపిక ప్రక్రియను స్పీకర్ పూర్తి చేస్తారు. కేబినెట్ ర్యాంక్ కోసం అల్లాడిపోతున్న జగన్ రెడ్డి పీఏసీ చైర్మన్ గా తమ పార్టీ తరపున తన పేరునే సిఫారసు చేయించుకుంటే..ఆయన కోరిక నెరవేరవచ్చని భావిస్తున్నారు. ఈ అంశంపై వైసీపీ సలహాదారులకు ఇంకా బుర్ర తట్టలేదో లేకపోతే సీఎంగా చేసి పీఏసీ చైర్మన్ గా చేయడం ఏమిటని జగన్ […]

Card image cap

దిల్ రాజు మాటలు దేనికి సంకేతం ?

సినిమా రివ్యూలు కొంత పుంతలు తొక్కుతున్నాయి. యూట్యూబ్‌ ఛానల్స్‌ ప్రభలంగా పుట్టుకొచ్చిన వచ్చిన తర్వాత సినిమా సమీక్షలు పక్కదారి పట్టాయి. క్రాఫ్ట్, సినిమా అప్రిషియేషన్ పై ఏ మాత్రం అవగహన లేని వారు కూడా రివ్యూవర్ అవతారమెత్తేస్తున్నారు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, పాటలు, ఫైట్లు అంటూ థియేటర్ ఎదురుగానే హంగామా చేస్తున్నారు. కొందరైతే హీరోలని, దర్శకులని పర్శనల్ గా కూడా ఎటాక్ చేస్తున్నారు. ఈ పెడ ధోరణి గమనించిన కోలీవుడ్‌ నిర్మాతల మండలి ఇటివలే ఓ […]

Card image cap

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎగ్దిట్ పోల్స్ – ఫలితం ఎటైనా కావొచ్చు !

మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో ఫలితాలు హోరాహోరీగా ఉంటాయని తెలుస్తోంది. పేరెన్నికగన్న సంస్థ ఏకపక్షంగా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం లేదు. అయితే గతంలో మంచి పేరు తెచ్చుకున్న కొన్ని సంస్థలు ప్రతి చిన్న విషయాన్ని విశ్లేషిస్తూ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ క్రమంలో పోరు హోరాహోరీగా ఉందని ఎవరైనా కొద్దిలో బయటపడతారని అంటున్నాయి. మైయాక్సిస్ ఇండియా జార్ఖండ్‌లో ఇండియా కూటమికి అధికారం వస్తుందని అంచనా వేసింది. అయితే ఫలితాలు తారుమారు కావొచ్చు. […]

Card image cap

కర్నూలులో హైకోర్టు బెంచ్ – ఏపీ కేబినెట్ తీర్మానం

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సిఫారసు చేస్తూ ఏపీ కెబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీలో భాగంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని నిర్ణయంచారు. అక్కడ వైసీపీ ప్రభుత్వం పెట్టిన లోకాయుక్త, ఇతర చిన్న కోర్టుల వల్ల ఆయా కోర్టులను ఆశ్రయించాలనుకున్న వారికి సమస్యలు ఎదురవూతూండటంతో అన్నింటిని అమరావతికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే దానికి అనుబంధంగా ఇతర కోర్టులను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కర్నూలులో […]

Card image cap

‘బ‌చ్చ‌ల‌మ‌ల్లి’ని అమ్మేశారు!

ఈరోజుల్లో ఓ సినిమా తీయ‌డం కాదు, దాన్ని మంచి రేటుకు అమ్మ‌డం నిర్మాత‌ల‌కు త‌ల‌కు మించిన ప‌నైపోతోంది. శాటిలైట్‌, ఓటీటీ హ‌క్కులు అంత త్వ‌ర‌గా అమ్ముడుపోవ‌డం లేదు. విడుద‌ల‌కు ముందు సినిమా అమ్మేసి, నిర్మాత సేఫ్ అయిపోవ‌డం కంటే గొప్ప అదృష్టం, అంత‌కు మించిన విజ‌యం లేదు. మ‌రీ ముఖ్యంగా మ‌ధ్య త‌ర‌గ‌తి సినిమాల‌కు ఇది చాలా ముఖ్యం. ఈ విష‌యంలో.. ‘బ‌చ్చ‌ల‌మ‌ల్లి’దే అదృష్టం. న‌రేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా ఇది. డిసెంబ‌రు 20న విడుదల చేద్దామ‌నుకొంటున్నారు. […]

Card image cap

మీడియా వాచ్‌: నిన్న గోల్డ్ క్వాయిన్‌లు.. ఈరోజు గిఫ్ట్ హ్యాంప‌ర్లు

మీడియాతో సినిమా వాళ్ల ఇంట్రాక్ష‌న్ల ప‌ద్ధ‌తి మారుతోంది. రెగ్యుల‌ర్ ప్ర‌శ్నోత్త‌రాల కార్య‌క్ర‌మం బోర్ కొట్ట‌డంతో.. వాళ్లూ కొత్త‌ద‌నం కోరుకొంటున్నారు. అందులో భాగంగా `మెకానిక్ రాఖీ` టీమ్.. ‘మంచి క్వ‌శ్చ‌న్ కొట్టు.. గోల్డ్ క్వాయిన్ ప‌ట్టు’ అనే కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. మంచి ప్ర‌శ్న అడిగిన జ‌ర్న‌లిస్టుల‌కు బంగారు నాణెం ఇచ్చి స‌త్క‌రించారు. ఇప్పుడు దిల్ రాజు టీమ్ కూడా ఇదే పంథాలో ఆలోచించింది. ప్ర‌శ్న‌లు త‌ర‌వాత‌.. ముందు ఈ సినిమా క‌థేంటో గెస్ చేయ‌మంటూ ఓ ఫ‌జిల్ విసిరింది. […]

Card image cap

బాలకృష్ణపై పడ్డ జగన్ – మళ్లీ షర్మిలే ఆయుధం !

జగన్ రెడ్డికి సలహాదారులు ఎవరో కానీ ఆయనను నిండా ముంచేసేదాకా వదిలి పెట్టడం లేదు. తాజాగా ఆయన ఏపీ అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తాను నిజం చెబుతానంటూ ప్రెస్మీట్ పెట్టారు. ఆయన బడ్జెట్ గురించి చెప్పింది ఒక్కరంటే ఒక్కరూ పట్టించుకోలేదు. కానీ ఆ ప్రెస్ మీట్ అయిపోయాక..తన చెల్లి షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారని ఆరోపించారు. ఇందుకు సాక్ష్యంగా షర్మిల పాత వీడియో ఒకటి ప్లే చేయించారు. ఆ వీడియో చూసిన వారికి నిజంగానే […]